తండ్రీ కూతుర్లు ఫుల్ బిజీ..?
ఈ క్రమంలో ముంబై ఎయిర్ పోర్టులో క్యాజువల్ లుక్లో కమల్ కనిపించగా, ఆయనతో ఫొటో దిగేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టులో ఉన్న కమల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కమల్ అభిమానులు. తండ్రి కమల్ ముంబైలో ఉండగా, కూతురు శ్రుతిహాసన్ హైదరాబాద్లో సందడి చేస్తోంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ‘సలార్’ షూటింగ్ ఫుల్ బిజీగా ఉంది శ్రుతి. ఈ క్రమంలోనే రికార్డింగ్ స్టూడియో బయట నిలబడి ‘సలార్’ కోసం వెయిటింగ్ అన్నట్లు ఫోజిచ్చింది బ్యూటిఫుల్ శ్రుతి.
నైట్ డ్రెస్లోనే స్టూడియోలో ఫొటోకు శ్రుతి ఫోజివ్వగా, దానిని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. మొత్తంగా తండ్రీ కూతుర్లు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. శ్రుతి హాసన్ ఇటీవల విడుదలైన టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’, మాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది శ్రుతి. ప్రస్తుతం ఈ భామ ‘లాభం, సలార్’ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోంది.