సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

Suma Kallamadi
కొవిడ్ మహమ్మారి వల్ల అత్యధిక నష్టపోయిన రంగాల్లో ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ ఒకటి.
కరోనా ఫస్ట్ వేవ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో క్లోజ్ అయిన థియేటర్స్ ఓపెన్ కాగనే మళ్ల సెకండ్ వేవ్ వచ్చేసింది. దాంతో టాకీసులు మళ్లీ మూతపడ్డాయి. ఇక ఇటీవల మళ్లీ ఓపెన్ అయ్యాయి. థియేటర్స్‌  ప్రస్తుతం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. టాకీసుల్లో ప్రస్తుతం టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ‘తిమ్మరుసు’, యంగ్ హీరో కిరణ్ ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి.


 కాగా కొవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయిన సినిమాలన్నీ సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ చిత్రాల్లో దాదాపుగా అన్నీ ఆల్రెడీ విడుదల తేదీలు అనౌన్స్ చేశాయి. కానీ, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ క్రమంలోనే వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ మంత్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. ఆ చిత్రాలు ఏంటంటే.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల-నాగచైతన్య, సాయిపల్లవి కాంబో ‘లవ్ స్టోరీ’, నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీశ్’, దగ్గుబాటి రానా ‘విరాట పర్వం’, గోపీచంద్ ‘సీటీమార్’, యంగ్ హీరో నాగ‌శౌర్య ‘వరుడు కావలెను’, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’,. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు వేచి చూస్తున్న  ఎస్.ఎస్.రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్‌లో విడుదల కానుంది.


ఈ చిత్ర ప్రమోషన్స్‌ను  ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నారు. కాగా, ఈ సినిమా కంటే ముందే  ఈ చిత్రాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  ఈ చిత్రాలకు విడుదల తేదీలకు సంబంధించి అధికారిక ప్రకటనలు త్వరలో వచ్చే అవకాశముంది. మొత్తంగా సెప్టెంబర్ నెల మూవీ లవర్స్‌కు పండుగలానే మారబోతున్నదని సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: