అడవి శేష్ ప్రస్తుతం 26 /11 దాడుల సమయంలో తన ప్రాణాలకు తెగించి, ఎంతోమందిని కాపాడిన మేజర్ ఉన్నికృష్ణన్
జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న 'మేజర్' సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అడవి శేష్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, సైయూ మంజ్రేకర్, శోభితా
ధూళిపాల ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ
సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ సినిమాలో ఎంతో ధైర్యసాహసాలు కలిగిన ఉన్నికృష్ణన్ చనిపోయిన విధానాన్ని మాత్రమే కాకుండా అతను జీవించిన విధానాన్ని కూడా చూపించబోతున్నారు. అయితే ఈ
సినిమా ఇప్పటికే విడుదల కావలసింది, కానీ భారతదేశంలో
కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో షూటింగ్ ని వాయిదా వేయవలసి వచ్చింది. అయితే ఈ సినిమాను 'ఓటిటి' లో విడుదల చేయబోతున్నారు అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి
. కానీ ఆ వార్తలపై మొదటినుండి చిత్రబృందం క్లారిటీ ఇస్తూనే ఉంది. తమ సినిమాను కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేస్తాము అని
సినిమా మేకర్స్ స్పష్టంగా చెబుతున్నారు. ఈ విషయమై మరోసారి
హీరో అడవి శేష్ క్లారిటీ ఇచ్చారు. మేజర్
సినిమా ఆఖరి షెడ్యూల్ ప్రారంభం అయ్యింది అంటూ ట్వీట్ చేసిన అడివిశేష్. ఈ సినిమాను మీ ముందుకు తీసుకు వచ్చేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ప్రేక్షకుల అందరికోసం ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తాం. అది పరిస్థితులు బాగుంటేనే.. మన 75 వ స్వాతంత్ర దినోత్సవం కూడా దగ్గరలోనే ఉంది అంటూ అడవి శేష్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక తెలుగు మరియు
హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్
ఇండియా చిత్రానికి శశి
కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి,
మురళి శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్లస్ఎస్ మూవీస్ సహకారంతో
సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్
ఇండియా బ్యానర్లపై ఈ సినిమాను తెరకెక్కించారు.