మాస్ట్రో కన్ఫ్యూజన్ లో నితిన్ !
ఇలాంటి పరిస్థితులలో ఈమూవీని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ హాట్ స్టార్ కు దాదాపు 35 కోట్లకు అమ్మేసారు అన్న వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి. అయితే ఈ విషయం పై క్లారిటీ కోసం అనేకమంది ప్రయత్నిస్తున్నప్పటికీ ‘మాస్ట్రో’ నిర్మాతలు ఈ వార్తలను అంగీకరించడం లేదు అదేవిధంగా ఖండించడం లేదు.
అయితే గత కొన్ని రోజులుగా ‘మాస్ట్రో’ చిత్ర బృందం తమ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఒక్కొక్కటిగా సాంగ్స్ ను విడుదల చేస్తూ సినిమాపై క్రేజ్ ను పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఎక్కడా ఈమూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించడం లేదు. దీనితో ఈమూవీ నిర్మాతలు ఇలా వ్యూహాత్మకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటూ నితిన్ అభిమానులు బాధ పడుతున్నారు. ఇప్పటికే పెద్ద సినిమాలు కూడా ఈ మధ్య ఓటీటీ రిలీజ్ అవుతుండటం పట్ల తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తీవ్ర అసంతృప్తిలో ఉంది.
ఇలాంటి నిర్ణయాల పై డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్లు థియేటర్ యాజమాన్యాలు కూడ సుముఖంగా లేరు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలంగాణా ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్స్ లో ప్రముఖ వ్యక్తి కాబట్టి ‘మాస్ట్రో’ సినిమా ఓటీటీ విడుదల ప్రకటన లేట్ అవుతుందేమో అన్న సందేహాలు సినీ వర్గాలకు వస్తున్నాయి. మరోవైపు థియేటర్లు తెరుచుకోవడంతో కొత్త సినిమాలు రిలీజ్ డేట్స్ ని ఇస్తున్నారు కాని నితిన్ మూవీ ప్రస్తావన లేదు. ఇప్పటికే ఈసంవత్సరం విడుదలైన తన రెండు సినిమాలు ఫెయిల్ అవ్వడంతో వస్తున్న ఓటీటీ ఆఫర్లను వదులుకోలేక ధియేటర్ రిలీజ్ పై నమ్మకం లేక టోటల్ గా ‘మాస్ట్రో’ కన్ఫ్యూజ్ అవుతున్నాడు..