సినీ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా రాజమౌళి కి ఎలాంటి ప్రత్యేకత ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి రేంజే మారిపోయింది. అయితే ఇప్పటి వరకు రాజమౌళి అగ్ర హీరోలు అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లతో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసాడు.ఇక అతి త్వరలో మరో అగ్ర హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు జక్కన్న.ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది.అయితే మిగతా స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో ఇప్పటి వరకు సినిమా చేయలేదు.రాజమౌళితో పవన్, అల్లు అర్జున్ కాంబో కోసం ఫ్యాన్స్ కూడా తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే రాజమౌళి కూడా ఈ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాడు.ఇక బాహుబలి2 తర్వాత రాజమౌళి.. ఎన్టీఆర్ బన్నీ ల కాంబోని కూడా పరిశీలించారు.అయితే చివరికి ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లను హీరోలుగా ఫైనల్ చేసాడు.అయితే రాజమౌళి, బన్నీ కాంబినేషన్లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం బన్నీతో రాజమౌళి సినిమా చేయలేకపోయినా..రాబోయే రోజుల్లో మాత్రం ఈ కాంబినేషన్లో సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.సరైన కథ దొరికితే ఈ కాంబోలో సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.
అయితే మహేష్ రాజమౌళి కాంబో తర్వాత బన్నీ తో రాజమౌళి సినిమా పట్టాలెక్కుతుందో చూడాలి.
మరోవైపు బన్నీ మాత్రం ఒక్క రాజమౌళి తప్ప మిగతా టాప్ డైరెక్టర్స్ అందరితో సినిమాలు చేశాడు.అంతేకాదు ఇప్పుడు పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు.దీంతో బన్నీకి పాన్ ఇండియా మార్కెట్ వచ్చాక..రాజమౌళి తో కచ్చితంగా సినిమా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న ఈ సినిమా విడుదల కానుంది...!!