హార్లీ డేవిడ్సన్‌పై ‘దివి’ సాహసాలు మామూలుగా లేవుగా...!

Suma Kallamadi
ఒకప్పటిలాగా ఇప్పడు టాలెంట్ ప్రదర్శనకు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో టాలెంట్ ప్రదర్శిస్తే చాలు.. లక్ ఉంటే ఆటోమేటిక్‌గా ఆఫర్స్ మిమ్మల్ని వరిస్తాయి. అలా సోషల్ మీడియా పుణ్యమాని కొందరు తెర వెనుక నుంచి తెరమీదకు వచ్చిన వారు ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా క్వీన్‌గా పేరు పొందిన హైదరాబాద్‌కు చెందిన దివి ప్రజెంట్ సాహసయాత్రకు బయల్దేరింది. ‘బిగ్ బాస్ సీజన్-4’ కంటెంస్టెంట్‌గా ఎంపికైన ఈ భామ ‘లెట్స్ గో’ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆ చిత్రం ఈమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయినా అవకాశాన్ని అయితే తెచ్చిపెట్టంది. 

సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన ‘మహర్షి’ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేసింది. ప్రజెంట్ టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తోంది ఈ భామ. సోషల్ మీడియాలో ఆల్వేస్ యాక్టివ్‌గా ఉండే దివి గ్లామరస్ లుక్స్‌తో పాటు హాట్ ఫొటోస్‌ను షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో నెటిజన్లు ఆమె ఫొటోలు చూసి హీరోయిన్‌గా నటించాలని కోరుతుంటారు. తాజాగా దివి ‘థై-థండర్ షోస్’తో సోషల్ మీడియను షేక్ చేస్తోంది.

 హార్లీ డేవిడ్ సన్ బైక్‌పై సాహసాలకు సిద్ధమైంది. ఈ క్రమంలో డెనిమ్ షార్ట్ ధరించి అందాలను ఎలివేట్ చేస్తూ కుర్రకారు మదిని దోచుకుంటోంది ఈ భామ. టాప్ టు బాటమ్ హాటెస్ట్ లుక్‌ను ఎలివేట్ చేయడంపైనే దివి ఫోకస్ చేసింది. ఈ ఫొటోను ఇన్ స్టా వేదికగా దివి షేర్ చేయగా అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇన్ స్టా గ్రామ్‌లో ఆమె ఫాలోవర్స్ ఈ ఫొటోను చూసి ‘బ్యూటిఫుల్, గార్జియస్ దివి’ అని కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో దివి టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి.. దివికి ఏ టాలీవుడ్ డైరెక్టర్ ఫిమేల్ లీడ్‌గా అవకాశం ఇస్తారో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: