చూపించడంలో వాళ్లను మించిపోయిన హీరోయిన్..!
రష్మిక మందన్న టాలీవుడ్ స్టార్ లీగ్‌లో జాయిన్ అయ్యింది గానీ.. ఇంకా నంబర్ వన్‌ని అందుకోలేదు. ఇక్కడ పూజా హెగ్డే టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. అయితే రష్మికకి స్టార్ లీగ్‌లో గట్టి పోటీ ఉంది గానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ దూసుకెళ్తోంది. సౌత్‌లో మరే హీరోయిన్‌కి సాధ్యంకాని రీతిలో 20 మిలియన్ ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.
సౌత్ హీరోయిన్స్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న అనే చెప్పాలి. ఇప్పుడు టాప్ లీగ్‌లో ఉన్న పూజా హెగ్డేకి 14.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే కియార అద్వానికి 18.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక సీనియర్లలో కాజల్‌కి 19.3 మిలియన్లు, సమంతకి 18మిలియన్ ఫాలోవర్స్‌తో రష్మికకంటే వెనకబడి ఉన్నారు.
రష్మిక మందన్న మిగతా హీరోయిన్స్‌తో పోల్చితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. దీనికితోడు రష్మిక రిలేషన్‌షిప్ గురించి ఎక్కువగా చర్చలు జరుగుతుంటాయి. రష్మిక ముంబయి వెళ్లాక డేటింగ్‌లో ఉందనే ప్రచారం కూడా ఎక్కువైంది. దీంతో రష్మిక స్టేటస్ గురించి తెలుసుకోవడానికి కూడా నెటిజన్లు ఈమెని ఫాలో అవుతున్నారని ఇండస్ట్రీ టాక్. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ లేపుతోన్న రష్మిక ఎప్పటికి టాప్ చైర్ అందుకుంటుందో చూడాలి. కానీ ఎప్పటికైనా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందడం ఖాయం అని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.