మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లుసిఫర్ సినిమాకి రీమేక్. ఈ సినిమాలో యంగ్ హీరో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ గా నయనతార నటిస్తుందని తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ సైరా అనే సినిమాలో నటించగా ఇప్పుడు మరొకసారి మెగాస్టార్ తో కలిసి ఆమె నటిస్తుండటం విశేషం. లూసిఫర్ సినిమా కథకు కొన్ని మార్పులు చేసి మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ తగ్గట్టుగా మార్చి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు.
వాస్తవానికి మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాలో హీరోయిన్ పాత్ర అనేది లేదు కానీ తెలుగునాట మెగా స్టార్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ పాత్రను క్రియేట్ చేశారట ఈ పాత్ర తప్పకుండా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని అంటున్నారు. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండదా మెగాస్టార్ చిరంజీవి సైతం నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలని భావించాడు. తెలుగులో అప్పుడో ఇప్పుడో సినిమాలు చేస్తూ తమిళం లో లేడీ ఓరియంటెడ్ హీరోయిన్ గా తమిళంలో మంచి మార్కెట్ ను సంపాదించుకున్న నయనతార ఈ సినిమాను ఒప్పుకోవడంతో ఒక్కసారిగా సినిమా రేంజ్ మారిపోయింది.
ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా కు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలో సెన్సార్ పనులు కూడా చేసుకోబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ మరొక కీలక పాత్రలో నటించగా కాజల్, పూజ హెగ్డే లు హీరోయిన్లుగా నటించారు. ఇది మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి మరో రెండు సినిమాలను కూడా సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు.