బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'అఖండ'.మాస్
డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల
రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో
బాలయ్య సరసన
ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో
బాలయ్య అఘోరా, ఫ్యాక్షనిస్టు అనే రెండు పాత్రలను పోషిస్తున్నాడు. ఇక ఈ
సినిమా షూటింగ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉంది.ప్రస్తుతం తమిళనాడులో ఈ సినిక క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు బోయపాటి.
ఇ
క తాజా సమాచారం ప్రకారం
సెప్టెంబర్ రెండవ వారానికి
సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందట.ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ
సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ సభ్యులు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో
అక్టోబర్ 8 న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారుట.దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.ఇక
దసరా సెలవులు కూడా అప్పుడే మొదలుకానున్నాయి కాబట్టి.. ఆ డేట్ కి సినిమాను విడుదల చేస్తే మంచి కలెక్షన్స్ వస్తాయనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇక గతంలో
బాలయ్య,
బోయపాటి శ్రీను ల కాంబోలో వచ్చిన సింహా,
లెజెండ్ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోవడంతో..
ఈ హ్యాట్రిక్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.అయితే మరోవైపు
రాజమౌళి ప్రెస్టీజియస్
మూవీ ఆర్ ఆర్ ఆర్
అక్టోబర్ 13 న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.కానీ ఇప్పుడు అఖండ రిలీజ్ డేట్ తో ఆర్ ఆర్ ఆర్
మూవీ రిలీజ్ డేట్ మరోసారి పోస్ట్ పోన్ అయినట్లు ఫిల్మ్
నగర్ వర్గాలు అంటున్నాయి.ఈ మేరకు ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది 2022
జనవరి 24 లేదా 25 తేదీల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.అందుకే అఖండ టీమ్ ముందస్తుగా
అక్టోబర్ 8 న తమ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు చెప్తున్నారు.మరి ఇందులో వాస్తవమెంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది...!!