SR కల్యాణమండపం OTT రిలీజ్ ఫిక్స్ అయిందా?
అతి తక్కువ బడ్జెట్ చిత్రాలను ఎటువంటి సందేహం లేకుండా థియేటర్లలో విడుదల చేసుకోవచ్చు అని చాలా మంది దర్శకనిర్మాతలకు భరోసా ఇచ్చిన చిత్రమే SR కల్యాణ మండపం చిత్రమని అందరు అనుకుంటున్నట్లు సమాచారం.ఒకవేళ ఈ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే మరింతగా మంచి కలెక్షన్స్ సాధించేది అనడంలో ఎలాంటి అనుమానం లేదని తెలుస్తుంది.ఇదిలా ఉండగా ఈ చిత్రం అతి త్వరలో ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. ఆగష్ట్ 27 నుండీ ఈ చిత్రం ఆహా లో స్ట్రీమ్ కాబోతుంది 'ఎస్.ఆర్.కళ్యాణమండపం'.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.
అంటే సినిమా విడుదలైన 3 వారాలకే ఈ చిత్రం ఓటిటిలో విడుదల కాబోతుందని సమాచారం.'కలర్ ఫోటో', 'క్రాక్','కుడి ఎడమైతే', 'నాంది' వంటి విజయవంతమైన సినిమాలతో దూసుకుపోతున్న ఆహా OTT ప్లాట్ ఫామ్ లో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన 'ఎస్.ఆర్.కళ్యాణమండపం' కూడా విడుదల కాబోతుండడం మంచి విశేషం.రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ సాధించడం విశేషం అని అందరు భావిస్తున్నారు మరి ott లో ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.