చాలా రోజుల తర్వాత సునీల్ హీరోగా సినిమా థియేటర్లో సందడి చేయనుంది. కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం మూడబడింది. థియేటర్లు లేకపోవడం, సినిమా షూటింగులు జరగకపోవడం వల్ల ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లే ప్రేక్షకులకు దిక్కయ్యాయి. తాజాగా కరోనా కేసులు తగ్గడంతో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చాలా సినిమాల్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. సునీల్ సినిమా కనపడుట లేదు కూడా థియేటర్లలోనే విడుదల కానుంది. గతంలో అనుకున్న విధంగా ఆ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం లేదు. ఆ సినిమాను ఆగస్టు 13న ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ థియేటర్లు ఓపెన్ కావడంతో 19న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమాలో సునీల్ కావాలనే కనిపించకుండా పోయారా లేదా క్రియేటివ్ కోసం ఆ టైటిల్ పెట్టారా అనేది త్వరలోనే తెలియనుంది. ఆ ఈవెంట్ లో సునీల్ కనపడకపోయే సరికి అందరికీ ఆశ్చర్యం వేసింది.
సునీల్ ఇంకో సినిమా షూటింగ్ లో బిజీ ఉండటం వల్ల ఈవెంట్ కు రాలేదని నిర్మాతలు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. సునీల్ కావాలనే సినిమా ఈవెంట్ రావడంలేదోమోనని గుసగుసలాడుతున్నారు. సునీల్ సినిమా ప్రమోషన్స్ కు రాకపోవడం అతడి కెరీర్ కే ఇబ్బందిని తెచ్చిపెడుతుందని మరికొందరు అంటున్నారు. ఇకపోతే సునీల్ సినిమాతో పాటే ఇంకొన్ని సినిమాలు కూడా థియేటర్లలో విడుదల కానున్నాయి. శ్రీవిష్ణు సినిమా రాజరాజచోర సినిమా, శ్రీముఖి నటించి క్రేజీ అంకుల్స్ సినిమాలు ప్రమోషన్స్ జరుపుకుంటున్నాయి. ఆ సినిమాల కంటే సునీల్ కనపడుట లేదు సినిమా ఈవెంట్ అంతగా జానాధరణను పొందలేదనే చెప్పొచ్చు. ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్న సినిమా కాస్తా థియేటర్లలో విడుదల చేయడంపై అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు.