కుర్ర కారు చూపులు తిప్పుకోకుండా చేస్తోన్న శ్రీదేవి కూతురు..?
కొంత మంది బంధువులకు మాత్రమే విందును ఏర్పాటు చేశారు. చిన్నపాటి రిసెప్షన్ ను ఏర్పాటు చేయడం వల్ల ఈ వేడుకలకు సంజయ్ కపూర్, మహీప్ కపూర్, జహాన్ కపూర్, అనిల్ కపూర్, ఫరా ఖాన్, తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాన్వి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. జాన్వీ అందానికి అందరూ ముగ్దులయ్యారు. రిసెప్షన్ లో క్యాజువల్ గా కనిపించిన జాన్వీ కపూర్ ఆ తర్వాత తన అందంతో అక్కడున్న వారిని ఆకట్టుకుంది. రిసెప్షన్ స్టేజ్ పైన బ్లూ టాప్ వైట్ బాటమ్ వేసుకుని చాలా అందంగా కనిపించింది. ఆ వేదికపైనే మరో ఇద్దరు చెల్లెల్లు కూడా అందర్నీ ఆకర్షించారు. జాన్వీ చెల్లి ఖుషి కపూర్, ఇంకో చెల్లి అన్షులా కపూర్ లు తమ ముఖారవిందంతో విందుకు వచ్చిన వారిని ముగ్దులను చేశారు. ప్రస్తుతం జాన్వీ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. కుర్రకారును తన అందంతో కట్టిపడేయడానికి త్వరలోనే తెలుగు తెరపై కూడా జాన్వీ కనిపించనుంది.