సినిమా విలాసవంతమైన జీవితాన్ని చూసి అంతా కుళ్లుకుంటారు. సినిమావాళ్ల లైఫే వేరని అనుకుంటారు. ఒక్కరోజు వారిలా ఎంజాయ్ చేసినా చాలని అనుకుంటారు. కానీ వాళ్లు సినిమా పరిశ్రమలో ఎదగటానికి ఎంతో కష్టపడతారని..నిద్రలేని రాత్రులను గడుపుతారని మాత్రం గ్రహించరు. లైంగిక వేధింపులు, కమిట్ మెంట్ లు వాటితో పాటు శారీరక శ్రమ కూడా ఏమీ తక్కువ కాదు. ఇక ప్రస్తుం టాప్ యాంకర్ గా ఉన్న శ్రీముఖి కూడా ఇండస్ట్రీలో ఎదిగేందుకు ఎన్నో కష్టాలను చూసిందట. ఆ విషయాన్ని తాజాగా శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. శ్రీముఖి నిజానికి జులాయి సినిమాలో అల్లు అర్జున్ కు సోదరి పాత్రలో నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తరవాత పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. దాంతో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.
అయితే యాంకర్ గా మాత్రం శ్రీముఖి ఎంతో సక్సెస్ అయ్యింది. యాంకర్ రవితో కలిసి శ్రీముఖి పటాస్ అనే షోలో సందడి చేసింది. ఈటీవీ ప్లస్ లో వచ్చిన ఈ షోకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇక ఆ తరవాత పలు టీవీ షోలు చేస్తూ యాంకర్ గా శ్రీముఖి ఫుల్ బిజీగా మారింది. అంతే కాకుండా బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వచ్చిన శ్రీముఖి తన మంచి మనసులో ప్రేక్షకుల మదిని దోచుకుంది. మాట మీద నిలబడుతూ నిజాయితీగా ఉంటూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. దాంతో బిగ్ బాస్ ద్వారా మరికొందరు అభిమానులను సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే శ్రీముఖి బిగ్ బాస్ లో ఇక ప్రస్తుతం సినిమాలలోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఈ నేపథ్యంలోనే శ్రీముఖి క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీముఖి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యాంకరింగ్ మొదలు పెట్టిన సమయంలో తనకు చాలా ఇబ్బందిగా అనిపించేదని శ్రీముఖి తెలిపింది. షూట్ సమయంలో చాలా సమయం నిలుచుని ఉండాల్సి వచ్చేదని అన్నారు. దాంతో తన కాళ్లు తిమ్మిర్లు పట్టేవని అలాంటి సంఘటనలు తన జీవితంలో ఎన్నో ఉన్నాయని చెప్పారు. అసలు తాను ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చానా అని కూడా బాధపడేదానినని చెప్పారు. కానీ తన తండ్రి సపోర్ట్ తోనే ఇండస్ట్రీలో ఎదిగానని చెప్పారు.