పుష్ప సినిమా యూనిట్ కు అల్లుఅర్జున్ వార్నింగ్ ఇచ్చాడా...?
ఈ సినిమాలో బన్నీ పాత్రను చాలా భయంకరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు సుకుమార్.ఇక ఈ సినిమా నుండి ఇటీవల కొన్ని సీన్స్ లీకవ్వడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే చిత్ర నిర్మాతలు పోలీసులను ఆశ్రయించి ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారని సమాచారం. అలాగే సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఈ మేరకు ఫిర్యాదు చేశారట చిత్ర యూనిట్. అయితే సినిమా యూనిట్‌కు హీరో అల్లు అర్జున్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఎవరూ కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని, అలాగే ఎడిటింగ్ రూమ్‌లో కూడా చాలా పకద్బంధీగా ఉండాలని ఆయన చిత్ర యూనిట్‌కు సూచించారని సమాచారం.పుష్ప చిత్రం తన కెరీర్‌లో చాలా ప్రత్యేకం కాబట్టే ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఆయన చిత్ర యూనిట్‌కు ఆర్డర్ వేశారని సమాచారం.
ఏది ఏమైనా వరుసగా స్టార్ హీరో సినిమాల నుండి లీకులు బయటకు వస్తుండటంతో బన్నీ తన సినిమాకు సంబంధించిన వరకు చిత్ర యూనిట్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి బన్నీ వార్నింగ్‌తో చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి మరి. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం అందరికి తెలిసిందే .