కొవిడ్ కట్టడికి విధించిన లాక్డౌన్, తర్వాత కాలంలో ప్రజలను ఆదుకుని దేవుడయ్యాడు నటుడు సోనుసూద్. తెరపైన ఆయన విలన్ అయినప్పటకీ నిజజీవితంలో
హీరో అని నిరూపించుకున్నారు. ఇకపోతే ఆయన సేవలకుగాను దేశం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉంది. తెలంగాణలోని ఓ ప్రాంతంలో ఆయన విగ్రహం పెట్టి
గుడి కూడా కట్టారు.
ఈ క్రమంలోనే సోనుసూద్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు బాగా పెరిగారు. వివిధ రూపాల్లో సోనుకు థాంక్స్ చెప్తూ ఆయన పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, ఉమా సింగ్ అనే ఫ్యాన్ సోనుపై తనకున్న అభిమానాన్ని వెరైటీగా తెలిపింది. సైకిలిస్ట్ అయిన ఉమాసింగ్ ఆఫ్రికాలోని
కిలిమంజారో పర్వతం వరకు సైకిల్‌పై వెళ్లి.. అక్కడి నుంచి
కాలి నడకతో పర్వతాన్ని అధిరోహించి అక్కడ భారత దేశం త్రివర్ణ పతాకంతో కూడిన పోస్టర్లో సోనుసూద్‌ను చూపిస్తూ ‘రియల్
హీరో ఆఫ్ ఇండియా’ అని అనౌన్స్ చేశాడు. ఇలా పర్వతంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వీడియోగా చిత్రీకరించి
ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.
ఈ వీడియోను చూసి సోను స్పందించాడు. ‘వావ్..ఇకపై నేను మౌంట్
కిలిమంజారో అన్నమాట..చాలా గర్వంగా ఉంది ఉమ’అంటూ ఉమా సింగ్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు సోను. ఉమాను చూసి గర్విస్తున్నానని, అతడు చాలా కష్టమైన పనిని చేసి చూపించాడని, అతడి మాటలతో తాను చలించిపోయానని, అతడు యువతకు స్ఫూర్తి అనే పేర్కొన్నాడు సోనుసూద్. ఇంత చిన్న వయసులో ఉమా సింగ్ సంకల్పం చూస్తుంటే మన భారతీయ యువత ఏదైనా చేయాలని మనసులో భావిస్తే.. దానిని సాధించేవరకూ నిద్రపోరని చెప్పేందుకు ఉమా సింగ్యే ప్రత్యక్షసాక్ష్యమని పేర్కొన్నాడు సోను. సోను ట్వీట్ ప్రస్తుతం రీ ట్వీట్స్‌తో నెట్టింట్లో వైరలవుతోంది. నెటిజన్లు సోను చేసిన సేవలను మళ్లీ గుర్తుచేస్తున్నారు. సోను ప్రస్తుతం
టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్
డైరెక్టర్ కొరటాల
శివ డైరెక్షన్లో
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ‘ఆచార్య’ ఫిల్మ్‌లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.