కొవిడ్ మహమ్మారి వల్ల ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ చాలా లాస్ అయిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే సినిమా షూటింట్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ ఆగిపోగా, ఇప్పుడిప్పుడే కంప్లీట్ చేసుకుంటున్నాయి. ఇక పెద్ద సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతున్నాయి. దాదాపుగా ఈ ఏడాది దసరా నుంచి వచ్చే ఏడాది సంక్రాంతి వరకు పెద్ద సినిమాలన్ని ఒక దాని తర్వాత మరొకటి విడుదలయ్యే చాన్సెస్ ఉంటాయని సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో పెద్ద సినిమాలో పోటీలో తలపడొచ్చు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ -ఐకాన్ స్టార్ బన్నీ కాంబోలో వస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప’ పార్ట్-1 క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఆల్రెడీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసేశారు. కాగా, డిసెంబర్ లాస్ట్ వీక్‌లోనే యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను- నటసింహం బాలయ్య కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ‘పుష్ప’ వర్సెస్ ‘అఖండ’ అనేలా పరిస్థితులు ఉండబోతున్నాయని అంచనా. అయితే, ఇంకా ‘అఖండ’ విడుదల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.
ఆరోగ్యకరమైన పోటీ ఉండటం కూడా ఒక రకంగా మంచిదేనని టాలీవుడ్ హీరోలు పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఒకే సమయంలో రెండు సినిమాలు విడుదల అయి రెండూ సూపర్ హిట్ అయితే ఇండస్ట్రీకి ఇంకా మంచి జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘పుష్ప: ది రైజ్’ పైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇక బాలయ్య నటిస్తున్న ‘అఖండ’పైన ఫ్యాన్స్‌కు ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బాలయ్య గత చిత్రాలు ‘ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్’ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. కాబట్టి ఈ సారి బాలయ్య బాక్సాఫీసును షేక్ చేస్తాడు గ్యారంటీగా అని ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. చూడాలి ఏం జరుగుతుందో మరి..