సాయి పల్లవి నాని సినిమాకు నో చెప్పిందా..?
ప్రేక్షకులు ఫిదా అయిపోతారట 100ల మిలియన్ల వ్యూస్ ను ఆమె డాన్స్ కు అందరు అభినందనలు చేప్తున్నారు. అందుకే, సాయి పల్లవి కోసం స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నారట . ఆమెను తమ సినిమాలో పెట్టుకోవాలని తెగ ఉబలాట పడుతున్నారని సమాచారం. కానీ, సాయి పల్లవి మాత్రం ఆచితూచి సినిమాలు చేసుకుంటూ పోతుందట
అయితే, ఈ ఏడాది సాయి పల్లవి నుండి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ విడుదల కావాల్సిందట. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు సినీ ప్రపంచమే తారుమారు అయిన పరిస్థితులు ఉన్నాయట m. ఐతే, ఈ రెండు మూడు నెలల్లో సాయి పల్లవి నుండి వరుసగా సినిమాలు విడుదల అయ్యేలా ఉన్నాయని సమాచారం. సాయి పల్లవి నటించిన క్రేజీ మూవీ 'లవ్ స్టోరీ' విడుదల తేదీ ఖరారు అయిందని సమాచారం.
శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కాబోతుందట. నిజానికి ఈ సినిమాలో నాగ చైతన్య హీరో అయినప్పటికీ.. ఈ సినిమాకి సంబంధించి క్రేజ్ మొత్తం సాయి పల్లవిదేనట. కేవలం సాయి పల్లవి వల్లే ఈ సినిమా పై అంచనాలు పెరిగాయని సమాచారం.ఎందుకంటే సాయి పల్లవి డ్యాన్స్ కారణంగా ఈ సినిమా సాంగ్ అయిన 'సారంగ దరియా' పాట 100 మిలియన్ల వ్యూస్ ను దాటిందట .
అలాగే సాయిపల్లవి చేస్తున్న మరో క్రేజీ మూవీ అయిన 'విరాటపర్వం'. ఈ సినిమాలో రానా హీరోగా రానున్న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యేలా లేదని సమాచారం . ఈ చిత్రాన్ని ప్రముఖ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కి ఆల్రెడీ అమ్మేశారట అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. కానీ, ఈ విషయం పై మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని సమాచారం.
మొత్తానికి సాయి పల్లవి నుండి ఈ రెండు మూడు నెలల్లోనే రెండు సినిమాలు విడుదల కానున్నాయట. మరోపక్క ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాతే తాను తెలుగులో కొత్తగా సినిమాలు ఒప్పుకుంటాను అంటూ.. సాయి పల్లవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ ను కూడా వదులుకుందని సమాచారం. అలాగే తాజాగా నాని కొత్త సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసిందని ఏది ఏమైనా పవన్ తో పాటు నాని సినిమాకి కూడా సాయి పల్లవి నో చెప్పడం ఆశ్చర్యమైన విషయమని తెలుస్తుంది.