భీమ్లా నాయక్ గురించి డైరెక్టర్ ఏమన్నారంటే ..?
ఇక టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్, లైక్ అందుకొని పవన్ కళ్యాణ్ ఒక రికార్డును క్రియేట్ చేశాడు.దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకి డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, దర్శకులు వివి.వినాయక ఒక మెయిన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ద్వారా ఈయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ.."ఇక ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నేను చేయలేదు.. వివి వినాయక్ ఎలా ఉంటాడో..? తన క్యారెక్టర్ ఏమిటో..? ఈ సినిమాలో చూపించపోతున్నారు. అది కేవలం ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుంది. అది కూడా రానాతోనే వుంటుంది. దీనికి సంబంధించి షూటింగ్ కూడా గత నెలలో పూర్తి అయినట్లు" చెప్పుకొచ్చాడు వివి.వినాయక్ .
ఇక ఆ సన్నివేశం ఏమిటంటే"పోయి పోయి అలాంటి వాడితో పెట్టుకున్నావ్ ఏమిటి..?"అనే డైలాగ్ రానాతో చూపించారట. ఈ డైలాగ్.. ఆ సమయానికి , ఆ సీన్ రావడంతో కచ్చితంగా సినిమా థియేటర్లలో విజిల్స్ పడతాయి అని చెప్పుకొచ్చాడు వివి వినాయక్. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ కూడా మాటలు అందిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈ సినిమాకి డైలాగులు త్రివిక్రమ్ రాస్తే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ చెప్పడం చేత, నిర్మాతలు త్రివిక్రమ్ ని ఈ సినిమాలో కి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా..? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమా విడుదల అవుతున్నా, అవేమి పట్టించుకోకుండా ఈ నిర్మాతలు సంక్రాంతి బరిలో విడుదల చేయాలని చూస్తున్నారట.