ఆ హీరోలతోనే బాలయ్యకు గట్టి పోటీ..?
దసరా కానుకగా అక్టోబర్ నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే, అదే సమయానికి అనగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా విడుదల కాబోతున్నదన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా విడుదల మళ్లీ పోస్ట్ పోన్ అవుతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య ‘అఖండ’ చిత్రం అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఫిల్మ్, మెగా హీరో వైష్ణవ్ తేజ్- క్రిష్ కాంబోలో వస్తున్న మూవీతో పోటీ పడాల్సి వస్తుంది.
అయితే, ఈ హీరోలు బాలయ్యకు పోటీ ఇస్తారో లేడో చూడాలి మరి.. కాగా, ఈ చిత్రాల విడుదలకు సంబంధించిన ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ‘బొమ్మరిల్లు’ ఫేమ్ డైరెక్టర్ భాస్కర్ డైరెక్షన్లో వస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’సినిమాలో అక్కినేని అఖిల్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఇక డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో వస్తున్న చిత్రంలో ‘ఉప్పెన’ ఫేమ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు. ఈ సినిమా ఓ నవల ఆధారంగా తెరకెక్కగా, వైష్ణవ్ సరసన హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.