సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న వైసీపీ ఎంపీ..?
కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే ఎంపీ అయ్యుండి కూడా, అతను ఇప్పుడు యాక్టర్ గా అడుగులు వేస్తున్నాడు. అతను ఎవరో కాదు వైయస్సార్ పార్టీ MP.MVV సత్యనారాయణ. ఈయన తాజాగా సినిమాల్లోకి వచ్చేందుకు ఆసక్తికరంగా ఉన్నాడట. అందుచేతనే ఇతను త్వరలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఇదివరకే ఈయన కొన్ని సినిమాలలో నిర్మాతగా కూడా వ్యవహరించాడు టాలీవుడ్లో. కానీ రాజకీయ వైపు వెళ్లడంతో వాటికి కాస్త దూరంగా ఉన్నాడు. విశాఖ ప్రాంతం నుండి ఒక మన్యం దొర అనే స్టోరీతో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి డైరెక్టర్ అంతా విశాఖ వాసులు అని సమాచారం. ఇక ఆయనే స్వయంగా ఇలాంటి సినిమాలలో ఒక విభిన్నమైన పాత్రలను వేయనున్నట్లు తెలిపారట . అందులో దేశభక్తి సినిమా కావడం చేతనే సత్యనారాయణ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభిస్తున్నారట. ఇలా రాజకీయం నుండి నటన వైపు వెళ్ళడం ఒక గమనార్హం.
ఇలా టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషా సినీ రంగాలలో కూడా కొంతమంది రాజకీయ ప్రముఖులు సినీ రంగంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే తమిళనాడు సీఎం కొడుకు కూడా ఇటీవల సినిమాలలో చేసి , తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఏది ఏమైనా త్వరలో మరి ఎంత మంది సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతారో వేచిచూడాల్సిందే.