వామ్మో.. యూట్యూబ్ ఛానల్ పెడితే ఇలా ఉంటుందా?

praveen
ఒకప్పుడు ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుని ఇక మంచి జీతం వస్తే చాలు అనుకునే వారు. దీనికోసం పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరూ అలా చేయడం లేదు. ఎందుకు అంటే మంచి జాబ్ కోసం కంటే యూట్యూబ్ లో ఫేమస్ కావడానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. యూట్యూబ్ లో ఒక్కసారి ఫేమస్ అయ్యారు అంటే ఇక లక్షలకు లక్షలు సంపాదించవచ్చు అని ఎంతో మంది ఇక యూట్యూబ్ నే ఆదాయంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం ఇక యూట్యూబ్ చూసేవాళ్ల సంఖ్య మాత్రమే కాదు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఫేమస్ అయిన వాళ్ల సంఖ్య కూడా అదే రేంజ్ లో పెరిగిపోతుంది.




 ఇక ఇలా యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు ఎంతో మంది భారీగానే ఆదాయం సంపాదిస్తున్నారు.  అయితే ఇటీవల కాలంలో అయితే ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఇక ఫేమస్ అవ్వడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  అంతే కాదు ఇంట్లో విషయాలను కూడా బయట పెడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ఎలాగైతే ఏంటి ముందు ఫేమస్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ పెడితే ఫేమస్ కావడానికి ఎన్ని కష్టాలు పడతారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు అన్న విషయాన్ని ఇటీవల కళ్ళకు కట్టినట్లు చూపించారు.



 అది ఎక్కడో కాదు ఏకంగా జబర్దస్త్ కార్యక్రమంలో.  జబర్దస్త్ షో కమెడియన్స్ ఎప్పుడూ సరికొత్త కాన్సెప్ట్ తో తెరమీదకి వస్తూ ఉంటారు. ఇటీవలే మళ్లీ కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను నవ్వించేందుకు  సిద్ధమయ్యారు. ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఇక ఇటీవల విడుదలైన ప్రోమో లో భాగంగా రాకెట్ రాఘవ స్కిట్ లో..  ఇక రాఘవ తన భార్యతో మాట్లాడుతుంటే జాగ్రత్తగా మాట్లాడండి మీరు ఒక ఛానెల్ సి.ఈ.ఓ తో మాట్లాడు తున్నారు అని చెబుతోంది. నువ్వు ఏ ఛానల్ పెట్టావే అంటూ రాకెట్ రాఘవ అడగగానే.. నిన్ననే యూట్యూబ్ ఛానల్ పెట్టాను అని చెబుతోంది భార్య. దీంతో రాకెట్ రాఘవ షాక్ అవుతాడు.  అంతేకాదు ఇక బీరువాలో ఉన్న చీరలు అన్నింటినీ కూడా చూపిస్తూ ఇక దాని చరిత్ర కూడా చెబుతూ ఉంటుంది భార్య.  డస్ట్ బిన్లో పడేసిన అరటి తొక్కను తీసి ఇది మా ఆయన తొక్క అంటూ చెబుతుంది.  దీంతో ఇక రాకెట్ రాఘవ షాక్ అవుతాడు.ఇలా యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టిన వారి ప్రయత్నాలు కళ్ళకు కట్టినట్టుగా చూపించి అక్కడున్న వారందరినీ పగలబడి నవ్వెలా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: