ఆ రోజు శ్రీదేవి కి ప్రపోజ్ చేసి ఉంటే వేరేలా ఉండేది.. సీక్రెట్ చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Pulgam Srinivas
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే అప్పట్లో జనాల్లో ఏదో తెలియని ఆత్రుత. రాంగోపాల్ వర్మ ఈసారి ఎలాంటి సినిమాను వెండితెరపై చూపిస్తారో అనే ఆత్రుత జనాలలో చాలా కనిపించేది. అంతలా సినిమా ఇండస్ట్రీ పై రామ్ గోపాల్ వర్మ ప్రభావం చూపెట్టారు . కానీ అప్పట్లో కనబరిచిన మ్యాజిక్ ను రాంగోపాల్ వర్మ ప్రస్తుతం మాత్రం కంటిన్యూ చేయడం లేదనే చెప్పవచ్చు. నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉండడం. తనకు నచ్చిన సినిమాలు తనకు నచ్చినట్లు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇదిలా ఉంటే  రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ , దివంగత నటి శ్రీదేవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. దర్శకుడు రాంగోపాల్ వర్మ కు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . అనేక ఇంటర్వ్యూలలో శ్రీదేవి పై ఉన్న ప్రేమను రాంగోపాల్ వర్మ బహిరంగంగానే చెప్పేశాడు. తాను అతిలోక సుందరి శ్రీదేవి కి అభిమానిని అని , శ్రీదేవి అందానికి భక్తుడని కూడా కొన్ని సందర్భాలలో రివీల్ చేశాడు. అయితే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి భార్యగా పొందే అవకాశం నాకు వచ్చింది అంటూ సన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు 'గోవిందా గోవిందా' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన వివరించాడు. 'గోవిందా గోవిందా' సినిమా సమయంలో శ్రీదేవి టాప్ హీరోయిన్. ఆ సమయంలో శ్రీదేవి కి కుటుంబ పరమైన సమస్యలు , సోదరితో వివాదం ఇలా చాలా రకాలైన సమస్యలతో సతమతమవుతూ ఉండేది. అలాంటి సమయంలో శ్రీదేవి ఒక రోజు నన్ను ప్రైవేటుగా కలిసి మాట్లాడింది. అంతకు రెండు నెలల ముందే నేను నా భార్యతో విడిపోయా , అయితే ఆ రోజు శ్రీదేవి నాతో షేర్ చేసుకున్న విషయాలను బట్టి చూస్తే అప్పుడు నేను ప్రపోజ్ చేసి ఉంటే విషయం వేరేలా ఉండేది. కానీ నేను ప్రపోజ్ చేయలేదు. దానికి రెండు కారణాలు కూడా ఉన్నాయి. శ్రీదేవి అంటే ఆరాధన భావన ఒకటి అయితే , రెండవది అప్పుడే నా జీవితంలోకి ఊర్మిళ రావడం అంటూ రామ్ గోపాల్ వర్మ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: