న్యాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'టక్ జగదీష్'.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న ఓటీటీ రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.కానీ అదే సమయంలో నాగచైతన్య, సాయిపల్లవి నటించిన `లవ్ స్టోరి` సినిమా కూడా థియేటర్లో విడుదల చేయనున్నారట.అయితే ఈ రెండు సినిమాల మధ్య పోటీ తప్పదని,థియేటర్ కోసం ఓ సినిమా, ఓటీటీ కోసం మరో సినిమా పోటీ పడుతుండటంతో థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమాపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు ఎగ్జిబిటర్లు.అయితే కరోనా కారణంగా పెద్ద సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం లేదు.
సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేయడమో, లేక ఓటీటీలో రిలీజ్ చేయడానికి మొగ్గుచూపుతున్నారు.అయితే నారప్ప` సినిమా ఓటీటీలో విడుదల చేయడం పై పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి .అయితే అది తమిళ నిర్మాత కలై పులి ఎస్ థాను నిర్ణయమని టాలీవుడ్ నిర్మాత సురేష్‌బాబు చెప్పారు. దాని తరువాత ఆ వివాదం ముగిసింది.అయితే ఇప్పుడు కూడా ఇలాంటి వివాదమే తలెత్తింది.అయితే ఇప్పుడు కూడా టక్ జగదీష్` చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 10న నాని నటించిన ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు .
ఈ విషయాన్ని స్వయంగా హీరో నాని వెల్లడించారు.నిర్మాతల ఒత్తిడి మేరకు, థియేటర్లలో పరిస్థితి, ఏపీలో థియేటర్లలో 100శాతం సీటింగ్‌కి అనుమతి లేకపోవడం ఇలాంటి కారణాల మూలంగా నిర్మాతల నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నట్టు నాని తెలిపారు.అయితే ఈ విషయం పై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ రోజు సమావేశమై చర్చించనున్నారు.థియేటర్లలో విడుదల కానున్న నాగచైతన్య `లవ్ స్టోరీ`సినిమా అదే రోజు విడుదలవుతున్న `టక్ జగదీష్` సినిమా వల్ల ప్రతికూల ప్రభావం ఉండవచ్చని థియేటర్ యజమానుల ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇది టాలీవుడ్‌లో మరో వివాదానికి దారితీసేలా కనిపిస్తుంది...!!