లవర్ చేసిన ఆ పనికి కటీఫ్ చెప్పిన హీరోయిన్..!

NAGARJUNA NAKKA
బాలీవుడ్‌లో ఆదర్శవంతమైన జంట ఎవరైనా ఉన్నారంటే అది రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణే. ఆ పెయిర్ ను చూసి చాలా మంది ముచ్చటపడేవారు కూడా. కానీ దీపికా పదుకొణె మాత్రం రణ్‌వీర్‌ కంటే ముందు ఇద్దరితో ప్రేమాయణం సాగించింది. అందులో ఒకరు బాలీవుడ్‌ ప్రముఖ హీరో రణ్‌బీర్ కపూర్ అయితే, మరొకరు విజయ్ మాల్యా ముద్దుల కొడుకు సిద్ధార్థ్ మాల్యా. అయితే సిద్ధార్థ్‌తో విడిపోయిన స్టోరీ చూస్తే యువకులకు పెద్ద గుణపాఠమే నేర్పించేలా ఉంది.

విజయ్‌ మాల్యా హయాంలో రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు నడుస్తోన్న సమయంలో ఆర్.సి.బి. మ్యాచుల్లో తెగ హడావిడి చేసేది దీపిక పదుకొణే. అయితే కొన్నాళ్ల తర్వాత ఆర్.సి.బి. మ్యాచుల్లోనే కాదు, సిద్ధార్థ్‌ మాల్యా లైఫ్‌లో కనిపించలేదు. మరి అంత కలిసి తిరిగిన వీళ్లు విడిపోవడానికి రెస్టారెంట్ బిల్‌ అసలు కారణమని చెప్పొచ్చు.

సిద్ధార్థ్ మాల్యా , దీపిక పదుకొణె ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్‌కి వెళ్లారట. అక్కడ డిన్నర్ కంప్లీట్ అయ్యాక దీపికని బిల్‌ పే చేయాలని చెప్పాడట సిద్ధార్థ్. ఇక ఈ బిజినెస్‌మెన్ ఆ మాట అన్నాడో లేదో దీపికకి ఫ్యూచర్ అర్థమైందట. బిల్‌ పే చేయాలని  చెప్పడం అవమానంగా ఫీలైందట దీపిక. అంతే వెంటనే సిద్ధార్థ్‌కి బ్రేకప్ చెప్పింది. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పింది దీపిక. దీపిక పదుకొణే బ్రేకప్ చెప్పాక సిద్ధార్థ్ మాల్యా ఎన్ని వివరణలు ఇచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాను ఒక్కసారి రెస్టారెంట్‌ బిల్ కట్టలేదనీ.. కానీ డైమండ్ జ్యువెలరీ గిఫ్ట్‌, లక్షల విలువైన బ్యాగులు, మరెన్నో బహుమతులు ఇచ్చాను కదా అని ప్రైవేట్‌గా, పబ్లిక్‌గా ఎంత చెప్పినా దీపిక మాత్రం మళ్లీ ప్యాచప్‌ కాలేదు. సో ఒక రెస్టారెంట్‌ బిల్‌తో మాల్యా, దీపిక లవ్‌స్టోరీకి బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు. చూద్దాం.. వీరి లైఫ్ ముందు ముందు ఎలా సాగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: