నానిని అనవసరంగా ట్రోల్స్ చేసున్నారా..??
ఇక అసలు విషయానికి వెళ్తే.. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్ జగదీష్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే నాని నటించిన మరో ప్రెస్టీజియస్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ కు కూడా రూ.50 కోట్ల ఓటిటి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
కాగా.. ఆ చిత్రం మేకర్స్ ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదంట. అంతేకాక.. థియేటర్ల గొప్పతనం గురించి అంతలా చెప్పి ఇప్పుడు మళ్ళీ ఓటిటికి వెళ్లడం ఏంటి అంటూ నెటిజన్లు నానిని ట్రోల్ చేస్తున్నారు. దాంతో నాని హర్ట్ అయ్యారు. ఇక ‘నన్ను ట్రోల్ చేసే వారికి ఒకటే చెబుతున్నాను.. నన్ను మీరు ట్రోల్ చేసినా నేను ఫీలవ్వను అని చెప్పారు. అయితే నిర్మాతల శ్రేయస్సు కోసం నేను వారి నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత నా పై ఉంది’ అంటూ ఓ లేకను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ తరుణంలో నాని చేస్తున్న దాంట్లో ఎటువంటి తప్పు లేదని కొందరు విశ్లేషకులు చెప్పుకొచ్చారు.
అయితే థియేటర్ల గొప్పతనం గురించి.. దాని పై బ్రతికే వారి గురించి నాని తన అభిప్రాయాన్ని చెప్పారు. అలాంటిది ‘టక్ జగదీష్’ ను థియేటర్లలో రిలీజ్ చేయించడం కోసం పారితోషికాన్ని కూడా వెనక్కి ఇవ్వడానికి రెడీ అయ్యారంట. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేట్రికల్ రిలీజ్ ఇచ్చినా రూ.10 కోట్ల లోపు బిజినెస్ అయిన సినిమాలే సేఫ్ అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే నాని సినిమాకి రూ.25 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తుంది. కాగా.. నానిని ట్రోల్ చేయడం మాత్రం చాలా తప్పు’ అంటూ వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.