ఆవిధంగా, అది హిట్టు కాబట్టి ... ఇది కూడా హిట్టేనా .... ??
మొదటి భాగాన్ని మించేలా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై దీనిని మరింత గ్రాండ్ గా నిర్మించదలిచారట నాగార్జున. ఆకట్టుకునే కథ కథనాలతో త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుందని ఒక వార్త వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో నాగార్జున తో పాటు ఆయన తనయుడు నాగ చైతన్య కూడా నటిస్తుండడం విశేషం. కృతి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేయనున్న ఈ సినిమాలో కూడా రమ్యకృష్ణ కీలక రోల్ చేయనున్నారు. అయితే ఈ సినిమా కూడా సోగ్గాడే చిన్ని నాయన మాదిరిగా సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.
దానికి కారణంగా ఇటీవల విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మనం సినిమాలో నాగార్జునతో పాటు చైతన్య కూడా నటించడం అది సూపర్ హిట్ కొట్టడం జరిగింది. తప్పకుండా అదే మాదిరిగా బంగార్రాజు మూవీ కి కూడా సక్సెస్ కలిసి రావడం ఖాయం అని, ఆ విధంగా తండ్రి, తనయులు ఇద్దరూ కూడా దీనితో సూపర్ హిట్ కొడతారని అంటున్నారు. మరి అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నట్లుగా బంగార్రాజు ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే ...!!