F3 సినిమా విడుదల అప్పుడేనా....?

murali krishna
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించిన మొదటి సినిమా అయిన పటాస్ తో సూపర్ హిట్ కొట్టాడు యువ దర్శకుడు అయిన అనిల్ రావిపూడి ఆ తరువాత సాయిధరమ్ తేజ్ తో సుప్రీం సినిమాను తెరకెక్కించి మంచి విజయం సాధించాడు.అలానే రవితేజ తో రాజా ది గ్రేట్ సినిమాను తీసి అందరిని మెప్పించాడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లతో ఎఫ్ 2 సినిమాను తెరకెక్కించి అందరిని కడుపుబ్బ నవ్వించాడు అనిల్.ఇటీవల మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు విజయంతో స్టార్ డైరెక్టర్ గా మారాడు.మంచి సినిమాలతో వరుసగా విజయాలు అందుకుంటూ విజయవంతంగా కొనసాగుతున్నారు అనిల్ రావిపూడి.ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా ఎఫ్3. మంచి ఫ్యామిలీ మరియు కామెడీ మూవీగా వచ్చిన ఎఫ్2 సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే ఈ మూవీలో కూడా వెంకటేష్,

వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా తమన్నా, మెహ్రీన్  మళ్ళీ కథానాయికలుగా నటిస్తున్నారట. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారట. మొదటి భాగం కంటే కూడా మరింత ఫన్, ఎంటర్టైన్మెంట్ అంశాలు ఉండేలా దర్శకుడు అనిల్ ఈ సినిమా స్టోరీ ఎంతో అద్భుతంగా రాసుకున్నారని సమాచారం.ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారని కొద్దిరోజుల నుండి ఒక వార్త మీడియా సర్కిల్స్ లో వైరల్ అవుతున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమా డిసెంబర్ ఆఖరి వారంలో రానుందని కూడా మరొక వార్త కూడా ప్రచారం అవుతుందని సమాచారం.అసలు ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయమై అందరిలో సందేహం ఏర్పడిందట.అయితే ఇప్పటికే సంక్రాంతి సమయానికి మహేష్, పవన్, ప్రభాస్ ల సినిమాలు వరుసగా విడుదల తేదీలు ప్రకటన చేయడంతో తమ సినిమాని సంక్రాంతికి ముందే డిసెంబర్ లో తీసుకువచ్చేలా ఎఫ్ 3 యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం వెల్లడి కావాల్సి ఉందని సమాచారం.

చాలా

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: