ఎంతమంది వచ్చినా విజయం నాదే 'మా' ఎలక్షన్ల పై కాదంబరి సంచలన వ్యాఖ్యలు..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమ 'మా' అధ్యక్ష పదవికి ఈసారి పోటీ చాలా రసవత్తరంగా ఉంది అని చెప్పవచ్చు. దాదాపు 'మా' అధ్యక్ష పదవి ఎన్నికలకు రెండు నెలల వ్యవధి ఉండగానే ప్రకాష్ రాజు నేను అధ్యక్ష పదవి పోటీలో దిగబోతున్నారు అని ప్రకటించుకున్నాడు. దీనితో ఈసారి చాలా ముందుగానే 'మా' ఎలక్షన్ల జోరు ప్రారంభం అయ్యింది అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత కొంత కాలానికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా బరిలో దిగుతున్న అని ప్రకటించడంతో ఈసారి పోటీ రసవత్తరంగా ఉండబోతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇంతలోనే జీవిత రాజశేఖర్ కూడా నేను బరిలో ఉండబోతున్నను అని ప్రకటించడంతో ఈ సారి త్రిముఖ పోరు తప్పదు అని  అభిప్రాయపడ్డారు. ఇలా వీరి ముగ్గురు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే నటి హేమ ,సీనియర్ నటుడు కె ఎల్ నరసింహారావు కూడా పోటీలో దిగబోతున్నారు ప్రకటించుకున్నారు.


ఇలా ఇప్పటికే ఎన్నికల బరిలో నిలిచిన వారి మధ్య మాటల పోరు నడుస్తూ ఉంటే మరో సీనియర్ నటుడు అయిన కాదంబరి కిరణ్ కూడా 'మా' ఎన్నికల బరిలో నేను దిగబోతున్నారు అని ప్రకటించుకున్నాడు . 'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అంటూ బాంబు పేల్చిన కిరణ్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇంతవరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వదిలేస కానీ, ఈ ఎలక్షన్లు మాత్రం వదిలేది లేదు ప్రస్తుతం పోటీలు ఐదుగురు కాదు ఎనిమిది మంది ఉన్నా కూడా నాకు ఏం పర్లేదు. నేను కూడా పోటీలో ఉంటా అంటూ ప్రకటించుకున్నాడు. ఎంతమంది పోటీలో ఉన్నా గెలుపు మాత్రం నాది అంటూ చాలా ధీమాను వ్యక్తం చేసాడు . మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తొమ్మిది వందల కోట్ల వరకు ఉంటాయి అందులో నాకు మూడు వందల ఓట్లు ఖచ్చితంగా వస్తాయి అని కాదంబరి కిరణ్ వ్యక్తం చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: