రాఖీ
పూర్ణిమ నాడు ఎక్కడెక్కడో ఉన్న అక్కా తమ్ముళ్లను మరియు అన్నా చెల్లెళ్లను కలిపే ఒక పండుగ. ప్రపంచంలో ఏ మూల ఉన్న ఆ రోజు ఖచ్చితంగా వారి మనసులో ఒక
భావన కలుగుతుంది. అవకాశం ఉన్న వారు నేరుగా అన్నా లేదా తమ్ముళ్ల దగ్గరకు వచ్చి రాఖీలను కడుతుంటారు. ఇది ఎంతో పవిత్రమైన కార్యం. ఈ శుభ కార్యమును శుభ సమయంలో మాత్రమే చేయాలి. రాహుకాలం, యమ గండములలో రాఖీని కట్టరాదు. శుభ సమయంలో మాత్రమే సోదరులకు వారి అక్క, చెల్లెళ్ళు రాఖీని కట్టడం శ్రేయస్కరం. అంతే కాకుండా వీలైనంత వరకు పౌర్ణమి రోజు పూర్తికాకముందే రాఖీని ధరించాలి. రాఖీ పౌర్ణమి రోజున ఆ సకల దేవతల ఆశీర్వాదం,
శక్తి తమని, తమ సోదరులను రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలి.
ఈ రాఖీకి గుర్తుగా లాగే అన్నాచెల్లల్ల బంధానికి నిలువెత్తు నిదర్శనంగా కొన్ని సినిమాలు తెరకెక్కించబడ్డాయి. వాటిలో అతి కొద్ది సినిమాలు మాత్రమే ప్రజల మనసుకు చేరువయ్యాయి. అటువంటి వాటిలో ఒకటే 'గోరింటాకు' మూవీ. చిన్నతనంలోనే రోడ్ ఆక్సిడెంట్ లో తల్లితద్రులను కోల్పోయిన ఇద్దరు అన్న చెల్లెల్లు ఒంటారి వారయిపోతారు. అప్పటి నుండి తన చెల్లెలు లక్ష్మిని
అన్నయ్య అశోక్ ఎంతో ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు. తన ఏదైనా కష్టమొస్తే అల్లాడిపోతాడు. ఈ సినిమాను తెరకెక్కించిన
వి ఆర్ ప్రతాప్ కేవలం వీరిద్దరి అనుబంధాన్ని చూపించడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఆయన శ్రమకు తగ్గ ఫలితం దక్కింది.
సినిమా ఆద్యంతం అన్నా చెల్లెళ్లుగా నటించిన
రాజశేఖర్ మరియు మీరాజాస్మిన్ వారి నటనతో
సినిమా లెవెల్ ను పెంచారని చెప్పాలి. కొన్ని కారణాల వలన గొడవపడి మెట్టినింటి నుండి పుట్టింటికి వచ్చిన మీరాజాస్మిన్, పుట్టింటిలోనూ వదిన కారణంగా అవమానానికి గురవుతుంది. మీరాజాస్మిన్ తన బిడ్డలను తీసుకెళ్లి ఒక బావిలో పడి ఆత్మహత్య చేసుకుంటుంది.
అన్నయ్య లేని సమయంలో తన చెల్లెలిని అవమానించిన భార్యపై తీవ్ర అసహనాన్ని చూపిస్తాడు. చెల్లెలు చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న
రాజశేఖర్ గుండెలు పగిలేలా రోధిస్తాడు. ముక్కుపచ్చలారని పసిపిల్లలు కూడా చనిపోవడంతో చూస్తున్న ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పిస్తుంది. చివరకు చెల్లెలు లేని ఈ ప్రపంచంలో నేనుందుకు బ్రతకాలి అని చెల్లెలుపైనే పడి తాను కూడా చనిపోతాడు. ఈ సన్నివేశం ఎందరో అన్నాచెల్లెళ్ల అపురూపమైన బంధానికి ప్రతీకగా నిలిచింది. నేటికీ ఈ
సినిమా టీవీ లో వస్తే, కన్నీరు కారుతున్న పట్టించుకోకుండా సినిమాను పూర్తిగా చూస్తుంటారు. ఈ సినిమాకు థియేటర్లలో టిక్కెట్లు దొరకని పరిస్థితులు కూడా చూశాము. చెల్లెలి సెంటిమెంటుతో వచ్చిన సినిమాలలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది...