డైరెక్టర్ల హీరో మన మెగాస్టార్...

VAMSI
టాలీవుడ్ కి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఆనాడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మరియు కృష్ణల కాలం నుండి నేటి వరకు ఎంతో మంది గొప్ప గొప్ప డైరెక్టర్లు అనేక మంచి సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమా గౌరవాన్ని శిఖరాగ్రాన నిలబెట్టారు. అయితే చాలా మంది హీరోలు ఒక డైరెక్టర్ కథ చెప్పడానికి వెళ్తే అందులో మార్పులు చెబుతూ డైరెక్టర్ రాజీ పడేలా చేస్తారు. ఇప్పటికీ చాలా హీరోల విషయంలో అలాగే జరుగుతోంది. డైరెక్టర్స్ కూడా హీరోలు చెప్పిందే విని కథలో మార్పులు చేస్తున్నారు. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అవుతుంటే, మరి కొన్ని దారుణమైన ఫలితాన్ని చవిచూస్తున్నాయి. ఇది సాధారణమే. అయితే అతి కొద్ది మంది హీరోలు మాత్రమే డైరెక్టర్ చెప్పిన కథలలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా వారు చెప్పిన స్క్రిప్ట్ కు ఓకే చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

అలాంటి హీరోలలో ఒక్కరే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి తన మొత్తం కెరీర్ లో ఎప్పుడూ కూడా డైరెక్టర్ చెప్పిన కథకు అడ్డు చెప్పిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. చిరంజీవి డైరెక్టర్ కోణం నుండి ఆలోచిస్తారు. ఒక కథను రాసుకునే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు డైరెక్టర్. అందుకే కథ మరియు స్క్రిప్ట్ విషయంలో తుది నిర్ణయం డైరెక్టర్ కే వదిలేస్తాడు. అలా డైరెక్టర్ కి ఇచ్చిన ఫ్రీడమ్ కారణంగానే చిరంజీవి కెరీర్ లో ఈ హీరో ప్రతి ఒక్క జోనర్ లో సినిమాలను చేశాడు. ఎన్నో అద్భుతమైన కథలు సినిమా రూపం దాల్చాయి. గూఢచారి కథ అయినా, పోలీసు కథ అయినా, దొంగ కథ అయినా, జానపదం అయినా, సాధారణ వ్యక్తిగా అయినా ఇలా ఎన్నో పాత్రలలో చక్కగా డైరెక్టర్ చెప్పినట్లు ఒదిగిపోయి ప్రజల్లో మెగాస్టార్ గా వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు.

అందుకే చిరంజీవిని టాలీవుడ్ లో డైరెక్టర్ హీరోగా చెప్పుకుంటూ ఉంటారు. గత సంవత్సరం తీసిన సైరా నరసింహ రెడ్డి కూడా ఒక వినూత్న ప్రయత్నమే. కానీ చిరంజీవి చాలా బాగా ఆ పాత్రలో ఒదిగిపోయి తన కీర్తిని మరింత రెట్టింపు చేసుకున్నాడు. తాజాగా చిరు వరుస సినిమాలను చేస్తూ యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. లూసిఫర్ మలయాళ  రీమేక్ ను లైను లో పెట్టాడు. ఇంకా రెండు సినిమాలు రెడీ గా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: