చిరంజీవి అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలు ... ఇవే..?
1). సైరా నరసింహారెడ్డి:
డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి తో వచ్చిన సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాలో పలువురు స్టార్లు కూడా నటించడం జరిగింది. అయితే ఈ సినిమా 132 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.
2). ఖైదీ నెం: 150:
డైరెక్టర్ వివి వినాయక్ తో చిరంజీవి కలిసి సెకండ్ ఇన్నింగ్స్ తో ఎంట్రీ ఇచ్చిన మూవీ ఖైదీ నెంబర్ 150. ఈ సినిమా 104 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.
3). ఇంద్ర:
మణిరత్నం దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం ఇంద్ర. అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్ తో 27 కోట్ల రూపాయలను సాధించింది.
4). శంకర్ దాదా MBBS:
డైరెక్టర్ జయంత్ పరాంజీ తో చేసిన చిత్రం శంకర్ దాదా ఎం బి బి ఎస్. ఈ సినిమా 26 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
5). ఠాగూర్:
డైరెక్టర్ వివి వినాయక్ తో కలిసి ఠాగూర్ సినిమాలో నటించిన చిరంజీవి..24 కోట్ల రూపాయలను సాధించింది.
6). స్టాలిన్:
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విభిన్నమైన కథతో వచ్చిన సినిమా స్టాలిన్. ఈ సినిమా దాదాపుగా 23 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
అలాగే శంకర్ దాదా జిందాబాద్ -18 కోట్ల రూపాయలు, అన్నయ్య - 13 కోట్ల రూపాయలు , జై చిరంజీవ - 12 కోట్ల రూపాయలు, ఘరానా మొగుడు -10 కోట్లు ఇంకా మరి కొన్ని సినిమాలు చిరంజీవి సినీ కెరియర్ లో ఉన్నాయి.