సుధీర్ కాబోయే భార్య.. ఏ జిల్లా వధువో తెలుసా ..?

Divya
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ ఎప్పుడూ ఏదో ఒక వార్తలో నిలుస్తూ ఉంటాడు. ఇకపోతే సుధీర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనే విషయం ప్రేక్షకులను ఎక్కువగా గాబర పెడుతున్న విషయం. ప్రస్తుతం ఇతని పెళ్లిపై కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు సుధీర్ పెళ్లి కి సంబంధించిన ఒక విషయం తెలిసింది. ఆ విషయం ఏమిటో చూద్దాం.

స్టేజ్ పైన సుడిగాలి సుధీర్, రష్మిక ఎంతో అద్భుతంగా నటిస్తారు. వీరి జంట ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. కాని వీరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. కానీ వీరు మంచి దోస్తులం అంటూ చెప్పుకొస్తూ ఉంటారు. ఇక సుడిగాలి సుధీర్ వివాహంపై తన స్నేహితులు గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ తెగ వెతుకుతున్నారట, సుధీర్ పెళ్లి చేసుకునే అమ్మాయి కోసం.

సుధీర్ పక్కన ఉండే వారి నుంచి వస్తున్న విషయం ఏమిటంటే.. ఇప్పటికే సుధీర్ కు 32 సంవత్సరాలు దాటి పోయాయి. కొద్దిరోజుల క్రితమే 33వ యేట అడుగుపెట్టాడు. సుధీర్ బ్రహ్మచారిగానే ఉండిపోతాడో ఏమో అన్నట్టుగా ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నడంతో.. సుధీర్ కోసం  పెళ్లి సంబంధాలను చూడడం మొదలు పెట్టాడట. అయితే ప్రస్తుతం తమ ఫ్యామిలీకి సంబంధించిన కొంత మంది బంధువుల ద్వారా వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
కానీ ఆ సన్నిహితులు చెప్పిన మేరకు సుధీర్ కు.. ఒక సంబంధం బాగా నచ్చిందట. అందుకు సుడిగాలి సుధీర్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక అమ్మాయి విషయానికి వెళితే, ఆమె ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన యువతిగా తెలుస్తోంది. వీరిరువురి జాతకాలు కూడా సరిపోయినట్లు సమాచారం. దీంతో వీరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఇది. అయితే ఈ విషయం నిజమో..? కాదో ..? కొద్దిరోజులు ఆగి ఉండాల్సిందే. ఇక వీరి పెళ్లి పై అభిమానులలో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: