టాలీవుడ్ యువ సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు.తాజాగా థమన్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి.వాటిల్లో బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ' సినిమా కూడా ఒకటి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండీ విడుదలైన టీజర్ల కు ఆడియన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇదిలా ఉంటె నందమూరి అభిమానులకు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు.అతి త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుందని వెల్లడించారు థమన్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవల తమిళనాడులో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేయాలని మూవీ టీమ్ భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి పాటతో అఖండ ప్రమోషన్స్ ను మొదలు పెట్టనున్నారట. ఇక అతి త్వరలోనే ఈ పాటను విడుదల చేయనున్నట్లు సమాచారం.ఇక మే 28 న విడుదల కావాల్సిన ఈ సినిమా పలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇక తాజాగా అక్టోబర్ నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
అంతేకాదు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కి బదులుగా అక్టోబర్ 13 న అఖండ ను విడుదల చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇకఈ సినిమాలో పాటలకు కూడా ప్రత్యేక స్థానం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ సినిమా కోసం థమన్ ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్ ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. మరి బాలయ్య సినిమాకు థమన్ ఎలాంటి పాటలు ఇచ్చారో తెలియాలంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది.బాలయ్య ద్విపాత్రాభినయం పోషిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ తో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి అఖండ ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి...!!