హీరో రాజశేఖర్ మరో కూతురు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ 'దొరసాని' సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం కూడా శివాత్మిక రాజశేఖర్ మరికొన్ని సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. కాకపోతే రాజశేఖర్ పెద్ద కూతురు శివాని మాత్రం ఇంకా వెండితెర ద్వారా ప్రేక్షకులను పలకరించలేదు.
అయితే శివాని 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించటానికి రెడీ గా ఉంది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన '118' వంటి సూపర్ హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన కె.వి.గుహన్ 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇప్పటికే యూట్యూబ్లో విడుదల చేసిన పాటలు జనాల నుండి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఇందులో అదిత్ తరుణ్ , శివాని రాజశేఖర్ కెమిస్ట్రీ హైలెట్ అయ్యేలా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంది. ఈ సినిమాలో శివాని ,మిత్ర అనే పాత్రలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ఇప్పటికే జనాల నుండి మంచి స్పందన తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఆగస్టు 24వ తేదీ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వస్తుంది అని చిత్ర బృందం తెలియజేసింది. రేపు ఉదయం 11 గంటల 5 నిమిషాలకు ఆగిపోయే అప్డేట్ వస్తుంది అంటూ తెలియజేశారు. ఈ చిత్ర బృందం ఏ అప్ డేట్ తెలియజేస్తుందో అని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే శివాని రాజశేఖర్ బిగ్ స్క్రీన్ మీద రచ్చ చేయడానికి అంతా సిద్ధం అవుతుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.