హీరో నవదీప్ కెరీర్ నాశనం అవడానికి కారణం వారేనా...?

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో జై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ ఆ సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించాడు.ఇక తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి మంచి నటుడుగా బాగా గుర్తింపు పొందాడు.తన సినీ ప్రస్థానం ఎలా నాశనం అయ్యిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సినీ పరిశ్రమలోకి వచ్చి దాదాపు 16 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఎన్నో సినిమాలలో నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన రేంజ్ ఫలితం ఇవ్వలేదని సమాచారం. ఒకటి రెండు సినిమాలు తప్ప మరే సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదని సమాచారం. ఇక కొందరు హీరోల పక్కన సైడ్ క్యారెక్టర్ లో నటించిన నవదీప్ కు అంతగా కలిసి రాలేదట .ప్రస్తుతం నవదీప్ ఒక వెబ్ సిరీస్ తో పాటుగా,  రెండు ఇతర భాషల సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటిస్తున్నట్లు ఆయన తెలిపినట్లు తెలుస్తుంది.అయితే ఆయన తన మాటల్లో చెప్పిన కొన్ని విషయాలను ఇప్పుడు మనం చూద్దాం.

ఆయన గురించి కొన్నిసార్లు నవదీప్ తన నిజజీవితంలో విలన్ గా ఉంటాడని వార్తలు వచ్చినట్లు సమాచారం. అయితే అవి ఒట్టి గోసిప్స్ అని చెప్పుకొచ్చాడు నవదీప్. బేసికల్ గా నేను చాలా మంచి వాడిని అని చెప్పాడట.కేవలం మీడియా మాత్రమే తనను చెడ్డవాడిగా చిత్రీకరించి చూపించిందని అని తెలిపినట్లు సమాచారం. నాకు తెలియక కొన్ని చిన్న చిన్న తప్పులను చేయడంవల్ల మీడియా ఎత్తి చూపించడం వలన నా మీద ప్రతినాయకుడి ముద్ర ఏర్పడినది అని చెప్పుకొచ్చారు. ఇక అంతే కాకుండా బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత తన పరిస్థితి చాలా మారిపోయింది అని చెప్పాడట. అయితే ఒకప్పుడు నవదీప్ gay అనే  పుకార్లు కొంతమంది పుట్టించారని చెప్తూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

ఆ వార్తలు చూసి తనకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు అబ్బాయిలంటే బాగా ఇష్టమట కదా  మీతో కొంచెం మాట్లాడొచ్చా అని అనడంతో తనకు భరించలేనంత కోపం వచ్చిందని సమాచారం. కానీ ఆ కోపాన్ని కూడా తగ్గించుకున్నాడట. తరువాత ఆయన కూల్ గా ఫోన్ కట్ చేసి పక్క వేశాడని తెలుస్తుంది. కేవలం సినిమా కోసమే అలాంటి గెటప్పులు వేయవలసివచ్చింది అని నవదీప్ చెప్పినట్లు సమాచారం. ఇక జీవితంలో బాగా సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకుంటాను అని తెలిపినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: