టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బుల్లితెర పెద్ద కొత్తమి కాదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగులో 'బిగ్ బాస్' మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించి బుల్లితెరపై తన సత్తా చాటుకున్నాడు. 'బిగ్ బాస్' మొదటి సీజన్ తోనే అంతగా జనాల్లోకి వెళ్లడానికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడమే కారణమని అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. 'బిగ్ బాస్' మొదటి సీజన్ తర్వాత ఎన్టీఆర్ చాలా కాలం పాటు బుల్లితెరకు దూరంగానే ఉన్నాడు.
అయితే మరోసారి ఎన్టీఆర్ బుల్లితెర మీద 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే 'షో' తో కనిపించబోతున్నాడు అనే వార్త బయటకు రావడం తోనే ఎన్టీఆర్ అభిమానులతో పాటు, మామూలు జనాలు కూడా 'ఎవరు మీలో కోటీశ్వరులు' ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూశారు. అయితే మరి కొంత కాలం తర్వాత ఈ 'షో' కు మొదటి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నాడు అనే వార్త బయటకు రావడంతో ఇద్దరు హీరోల అభిమానుల తో పాటు, మామూలు జనం కూడా ఈ 'షో' మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. ఇలా ఎన్నో అంచనాలతో రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆదివారం రోజు ఈ 'షో' మొదటి ఎపిసోడ్ ప్రారంభమైంది. అనుకున్నట్లుగానే రామ్ చరణ్ గెస్ట్ గా విచ్చేశాడు.
రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి నుండి మంచి స్నేహితులు కావడం , మరియు 'ఆర్ఆర్ఆర్' సినిమా వాళ్ళ మరింత స్నేహం బలపడటంతో వీరిద్దరూ చాలా సరదాగా ముచ్చటించారు. 'ఎవరు మీలో కోటీశ్వరులు' మొదటి ఎపిసోడ్ కే ఊహించలేనంత రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఎన్టీఆర్ ప్లాన్ సక్సెస్ అయింది అని , 'షో' కి ఊహించలేనంత రెస్పాన్స్ వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.