"భీమ్లా నాయక్" లో తమిళ భామ ?
ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేయడానికి శృతి హాసన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన పవర్ ను చూపించిన 'గబ్బర్ సింగ్' మూవీ జోడీ ఇపుడు ఇన్నాళ్లకు మరోసారి జత కట్టనుంది అంటూ ప్రచారం మొదలయ్యింది. ఈ సూపర్ హిట్ కాంబోకి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఇపుడు మరోసారి అదే మ్యాజిక్ ని క్రియేట్ చేసేందుకు ఈ పెయిర్ మన ముందుకు వస్తున్నట్లు సమాచారం. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శృతి హాసన్ పవర్ స్టార్ వరుస చిత్రాల్లో నటించి అలరిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ కల నెరవేరలేదు.
కానీ ఇన్నాళ్టికి మళ్ళీ వీరిద్దరి పేర్లు మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఫ్యాన్స్ ను సంతోషంతో ముంచెత్తుతున్నాయి. ఈ వార్త నిజమవ్వాలని ఆకాంక్షిస్తున్నారు అభిమానులు. అయితే త్వరలో ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. థర్టీ ప్లస్ వయసులో కూడా తన హవా చాటుతూ వెండి తెరపై స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ తన క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటున్న ఈ అందాల తార భీమ్లా నాయక్ సినిమాలో స్టెప్పులు వేస్తుందో లేదో చూడాలి. కాగా ఈ సినిమా నుండి విడుదలయిన భీమ్లా నాయక్ టీజర్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. పైగా రానా పాత్ర ఇందులో చూపకపోవడంతో ట్రోల్స్ దారుణంగా చేశారు.