సినీ లవర్స్ అందరికీ స్టార్ హీరోయిన్స్ నయనతార, సమతం అక్కినేని గురించి తెలిసే ఉంటుంది. లేడీ సూపర్ స్టార్ నయన్ ప్రజెంట్ దూసుకుపోతుండగా, సామ్ సైతం టాప్ హీరోయిన్గా అడుగులు వేస్తోంది. కాగా, వీరిరువురు ఓ సినిమాలో నటిస్తున్నారు. అదేంటంటే.. నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో వస్తున్న ‘కాతువాకుల రెండు కాదల్’ చిత్రం. ఇందులో వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరో కాగా సామ్, నయన్ హీరోయిన్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. సదరు వీడియోలో ఆర్టీసీ బస్సు ఫుట్ బోర్డులో సమంత, నయనతార, విజయ్ సేతుపతి ప్రయాణం చేస్తూ కనిపిస్తున్నారు.
ఇకపోతే ఇందులో సామ్, నయన్ ఇద్దరూ తెలుపు సారీలో ఉండగా, విజయ్ సేతుపతి వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు ధరించి ఉన్నారు. ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో,రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై లలిత కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా, ఈ ఫిల్మ్‌పై భారీగానే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
సామ్ ఈ చిత్రంతో పాటు ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘శాకుంతలం’ చేస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాకు క్రియేటర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నయన్ కూడా ఈ సినిమాతో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘నెట్రికన్’ ఫిల్మ్ ఓటీటీలో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తె’ చిత్రంలోనూ నయనతార నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు జి.ఎస్.విక్నేష్ డైరెక్షన్లో వస్తున్న చిత్రంలోనూ నయన్ హీరోయిన్గా నటిస్తోంది. విజయ్ సేతుపతి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంతో పాటు దాదాపు అరడజను కంటే ఎక్కువ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు సేతుపతి. లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్లో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న ‘విక్రమ్’ ఫిల్మ్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు విజయ్ సేతుపతి.