నానీ కెరీర్ ప్రమాదంలో పడినట్టేనా ?

VAMSI
తెలుగు సినిమా పరిశ్రమలో అతి కొద్ది మంది మాత్రమే ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా సొంత టాలెంట్ మరియు కృషితో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అటువంటి వారిలో ఒకరు నాచురల్ స్టార్ హీరో నాని. ఈ మధ్య ఎదో ఒక విషయములో నాని సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారుతున్నారు. ఒక చిన్న హీరో స్థాయి నుండి స్టార్ హీరో రేంజ్ వరకు ఎదిగిన నాని. కథల విషయములో ఆచితూచి అడుగేస్తూ కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్నాడు. ఇది ఇలా ఉంటే కరోనా కారణంగా రెండు సంవత్సరాల కాలం నుండి సగటు ప్రేక్షకుడికి ఎంటర్ టైన్మెంట్ ఆశించిన స్థాయిలో దక్కలేదనే చెప్పాలి దీనికి కారణం థియేటర్స్ తెరవకపోవడమే. థియేటర్స్ లేకపోవడం షూటింగ్ లను ఆపేయడం వంటి కారణాలు ప్రేక్షకుడిని అసలు సిసలైన ఎంటర్ టైన్మెంట్ కు దూరం చేశాయి.

కట్ చేస్తే... కరోనా కాస్త నెమ్మదించింది...ఆగిపోయిన సినిమా షూటింగ్ లు అన్నీ కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్నాయి. కానీ థియేటర్స్ లో సినిమాలను విడుదల చేసేందుకు హీరోలు సిద్దంగా లేరు. దీనికి కారణం ఈ మధ్యన విడుదలైన కొన్ని సినిమాలకు దక్కిన ఫలితమే అంటున్నారు సినిమా వర్గాలు. ఎంతో దైర్యం చేసి నిర్మాతలు సినిమాలను థియేటర్లో విడుదల చేసినా ప్రేక్షకులు ఎందుకో రావడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన హీరోలు వారి సినిమాలను ఓ టీ టీ లలోనే విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. కొందరు నిర్మాతలు అర్థం చేసుకుని హీరోలకు సహకరిస్తున్నారు. కొందరేమో  హీరోల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఇదే పరిస్థితిని హీరో నాని ఎదుర్కొంటున్నాడు. త్వరలో విడుదల కావాల్సిన నాని మూవీ "టక్ జగదీష్" విషయంలో  ఎటూ తేల్చుకోలేక చివరికి నా సినిమాను ఓ టి టి లోనే విడుదల చేస్తానని ఖరా ఖండీగా చెప్పేశారు. ఈ విధంగా నిర్మాతలతో వివాదాలు పెట్టుకున్నాడు. ఇక డిస్ట్రిబ్యూటర్ లతో కూడా గొడవపడ్డారు. ఎందుకంటే సినిమా థియేటర్ లో విడుదల చేయడం లేదని ప్రకటించిన వెంటనే నానికి వ్యతిరేకంగా డిస్ట్రిబ్యూటర్ లు వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారు. ఇలా పలు సమస్యలు తన మెడకు చుట్టుకున్నాయి. ఈ విషయం నాని భవిష్యత్తుపై దెబ్బేయనుందా ? ఇకపై నానీ చేసే  సినిమాలు థియేటర్లో విడుదల అవుతాయా అన్న పలు ప్రశ్నలు నానీ అభిమానులను బాధిస్తున్నాయి. అయితే పరిశ్రమలో ఉన్న నిర్మాతలు అలాగే డిస్ట్రిబ్యూటర్ లు ప్రస్తుతం ఉన్న సమస్యను అర్థం చేసుకుని హీరోలకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నానీ విషయంలో ముందు ముందు ఏమి జరగనుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: