బిగ్ బాస్ గురించి తన మనసులో మాట పంచుకున్న సుశాంత్...!

murali krishna
కాళిదాసు సినిమా తో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సుశాంత్ . కెరీర్‌ ఆరంభంలో పెద్దగా హిట్లు లేకపోయినా కూడా ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడట సుశాంత్. అయితే 2018 లో యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన 'చి.ల.సౌ' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.అలానే త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించి బాగా ప్రేక్షకులని అలరించాడు హీరో సుశాంత్. ప్రస్తుతం ఈ హీరో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు సమాచారం.అయితే ఈ చిత్రం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది అని భారీగా అంచనాలు వున్నాయని చెప్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ మరియు పోస్టర్‌లు విడుదల అయ్యాయట . తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అయినట్లు సమాచారం.ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. చివరివరకు ఉత్కంఠ రేపే ఈ ట్రైలర్ ని చూస్తే సుశాంత్ కి తిరుగులేదు అనేట్టుగానే కనపడుతుందట . ఇక ఈ చిత్రం ద్వారా యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా పరిచయం అవుతున్నట్లు తెలుస్తుంది. వెంకట్ మరియు వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం ముఖ్య పాత్రలలో నటిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమా ఆగస్టు 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని 'కింగ్' నాగార్జున విడుదల చేశారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా లో హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్ ట్విస్టులు ప్రేక్షుకులని మెప్పిస్తాయట. చివర్లో 'వాళ్లు హోల్‌సేల్‌గా లేపేసే బ్యాచ్‌రా 'అంటూ సుశాంత్ చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ముగుస్తుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే హీరో సుశాంత తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడని తెలుస్తుంది. ఆ ఇంటర్వ్యూ లో సుశాంత్ ఈ సినిమాకి సంబందించిన విషయాలని పంచుకున్నాడట. ఆ తర్వాత యాంకర్ ప్రతీ సారి అక్కినేని ఫ్యామిలీ నుండి బిగ్ బాస్ కి ఎవరైనా స్పెషల్ గా వస్తారు కదా.. ఈసారి మీరు వచ్చే అవకాశం వుందా అని అడిగారట. దానితో సుశాంత్ నవ్వుతూ చూడాలి మరి అన్నాడట.దానితో యాంకర్ ఈ బిగ్ బాస్ కి మీరు వస్తారేమో అనుకున్నానని అన్నారట. దానికి కూడా చూడాలి అండి అంటూ మళ్ళీ నవ్వాడట సుశాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: