ఏదో ఒకటి చేయ్..! అంటూ పట్టుబడుతున్న బ్యూటీ..!

NAGARJUNA NAKKA
వాణీకపూర్.. డజన్ల కొద్దీ సినిమా అవకాశాలు సంపాదించుకున్న ఒకే ఒక్క హీరోయిన్. ఇది చూసిన వారంతా వామ్మో.. నిన్నగాక మొన్న వచ్చి ఏంటి ఇలా ఆఫర్లు వస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారు. ఇక హీరోయిన్లు అయితే ఈర్ష్యగా ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఆఫర్లతో పేరు సంపాదించున్న ఈ హీరోయిన్ .. తీరా రంగంలోకి దిగే సరికి ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా వాణీకపూర్ ను బ్యాడ్ లక్ వెంటాడింది. దీంతో ఈ ముద్దుగుమ్మపై ఫ్లాప్ హీరోయిన్ ముద్రపడిపోయింది.

ఇప్పటి వరకు యశ్ రాజ్ ఫిల్మ్స్ సపోర్ట్‌తో మెగా సినిమాలు చేసిన వాణీ ఇప్పుడు అక్షయ్‌కుమార్‌నే నమ్ముకుంటోంది. ఈ హీరో సాయంతో హిట్ ట్రాక్ ఎక్కాలని తెగ ఆశపడిపోతోంది. మరి ఈ హీరోయిన్ ని అక్షయ్ ఆదుకుంటాడా? అనే సందేహం నెలకొంది. వాణీ కపూర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు దాటుతోంది. ఈ ఎనిమిదేళ్లలో హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్‌ లాంటి హీరోలతో సినిమాలు చేసింది. కానీ స్టార్స్‌తో సినిమాలు చేసినా ఈమె స్టార్ మాత్రం మారడం లేదు. పైగా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ వరుస సినిమాలు ఇస్తోంది. ఫ్లాపులొచ్చినా వాణీకి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు ఆదిత్యా చోప్రా. అయితే ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా వాణీ ప్రూవ్ చేసుకోలేకపోతోంది.

యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌లో వాణీ కపూర్ ఇప్పటికే నాలుగు సినిమాలు చేసింది. 'శుద్ద్ దేశీ రొమాన్స్, ఆహా కళ్యాణం, బేఫికర్, వార్' మూవీస్ చేసింది. కానీ వీటిల్లో ఒక్క సినిమాలో కూడా వాణీ యాక్టింగ్ అదిరిపోయిందనే కాంప్లిమెంట్స్ రాలేదు. దీంతో వాణీ కపూర్ కెరీర్‌ కష్టాల్లో పడిపోయింది. ఫ్లాపుల హీరోయిన్‌గా మిగిలిపోయింది.

వాణీ కపూర్‌ లేటెస్ట్‌గా అక్షయ్‌ కుమార్‌తో 'బెల్‌ బాటమ్' అనే సినిమా చేసింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కరోనా లాక్‌డౌన్‌లతో వాయిదాలు పడుతూ ఆగస్ట్ 19న బరిలో దిగుతోంది. ఇక ఈ మూవీ నుంచి రిలీజైన 'సఖియా టు పాయింట్ ఓ' సాంగ్‌లో అక్షయ్, వాణీ కెమిస్ట్రీకి సెంట్ మార్క్స్‌ పడ్డాయి. ఇక సాంగ్‌కి సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమాపైనా భారీ హోప్స్‌ పెట్టుకుంది వాణీ కపూర్. మరి ఈ మూవీతో అయినా వాణీ హిట్ కొడుతుందేమో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: