మెగాస్టార్ కెరీర్ గురించి మీకు తెలియని నగ్న సత్యాలు ?
* చిరంజీవి కెరీర్ లో హాలీవుడ్ చిత్రం "ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్" చేయడానికి అంతా సిద్దం అయ్యాక అనుకోకుండా 1999 లో వివిధ కారణాలతో ఆ చిత్రం ఆగిపోయింది.
* ప్రపంచ సినిమా చరిత్రలో ఆస్కార్ అవార్డ్స్ కు ఎంత ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే. అలాంటిది దక్షిణ సినిమా పరిశ్రమ నుండి 1987 లో ఆస్కార్ అవార్డ్స్ వేడుకకు ఆహ్వానించబడ్డ మొట్ట మొదటి హీరో చిరంజీవి.
* 1990 లో చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం "కొదమ సింహం" ను ఇంగ్లీష్ లోకి "ది హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్" పేరుతో డబ్ చేశారు. ఇది మొదటి దక్షిణాది చిత్రంగా అప్పట్లో రికార్డ్ సృష్టించింది. అంతే కాకుండా "పసివాడి ప్రాణం" మరియు "స్వయంకృషి" సినిమాలను కూడా రష్యన్ భాషలో అనువాదం చేయబడ్డాయి.
* 1992 లో విడుదలైన "ఘరానా మొగుడు" చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ ను సాధించింది. ఈ సినిమా అత్యధికంగా 10 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ సంవత్సరం నుండే అమితాబ్ కన్నా ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోగా చిరంజీవి గుర్తింపు పొందాడు.
ఇలా కొన్ని విషయాలను చిరంజీవి ఫ్యాన్స్ పంచుకున్నారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది..