కరోనా సెకండ్ వేవ్ పోయి చాలా రోజులు అవుతున్న సినిమా థియేటర్లు మాత్రం పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు.సెకండ్ వేవ్ తర్వాత కేవలం తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే 100 శాతం ఆక్యుపెన్సి తో థియేటర్లు ఓపెన్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి.. ఇక తమిళనాడులో అయితే ఈ నెల 23 నుంచి 50 శాతం ఆక్యుపెన్సి తో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి.ఇక ఆంద్రప్రదేశ్ లో చూసుకుంటే 50 శాతం ఆక్యుపెన్సి తోనే ఇప్పటికే నడుస్తున్నాయి.అదికూడా రోజుకు మూడు ఆటలు మాత్రమే.ఇక మరో విచిత్రమైన విషయం ఏంటంటే సెకండ్ వేవ్ తర్వాత జనాలను థియేటర్లకు తీసుకొచ్చే మాస్ హీరో సినిమా ఇప్పటివరకు ఏదీ విడుదల కాకపోవడంతో..
తెలంగాణా లో వంద శాతం ఆక్యుపెన్సికి అనుమతి ఇచ్చినా ఇప్పటికీ చాలా థియేటర్లు తెరుచుకోలేదు.ఇక జంట థియేటర్లు ఉన్న చోట అయితే ఒక దాన్ని మాత్రమే తెరిచి ఉన్న సినిమాలనే రెండు రెండు ఆటల చొప్పున ప్రదర్శిస్తున్నారు.ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ ఏడాది చివర డిసెంబర్ నాటికి పరిస్థితులు కుదుటపడతాయని సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రొడ్యూసర్స్,ఎగ్జిబిటర్స్ భావిస్తూ.. ఆ నెలలో తమ తమ సినిమాలకు చెందిన విడుదల తేదీలను ఇప్పటికే ప్రకటించేశారు.అందులో మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీ డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న విడుదల కానుంది.
ఇక అదే సమయంలో బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాతో మన టాలీవుడ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.ఇక డిసెంబర్ 3 న 'తడప్' అనే హిందీ సినిమా కూడా విడుదల కాబోతోంది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'ఆర్ ఎక్స్100' సినిమాకి ఇది రిమేక్.ఇక ఈ సినిమాతో సునీల్ శెట్టి కొడుకు ఆహన్ శెట్టి బాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.అలాగే సోనీ సంస్థ 'స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్' అనే హాలీవుడ్ మూవీని డిసెంబర్ 17 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది.ఇలా డిసెంబర్ నెలను నమ్ముకొని పలు జాతీయ,అంతర్జాతీయ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.మరి అప్పటికీ పరిస్థితులు పూర్తిగా చక్కబడతాయా?లేదా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందా చూడాలి...!!