ఆర్ఆర్ఆర్ సినిమా కొత్త డేట్ అప్డేట్.. ఎప్పుడు వస్తుందో..??
అయితే అక్టోబర్ 13 నుంచి సినిమాను వాయిదా వేశామని కూడా ఇప్పటివరకు చిత్ర యూనిట్ అధికారికంగా ఎక్కడ తెలుపలేదు. ఇక ఆయన చెప్పకపోయినా ఇండస్ట్రీలో అందరికీ ఈ విషయంలో క్లారిటీ ఉండడంతో అక్టోబర్ 8, 13 తేదీలకు పలు చిన్న సినిమాలు డేట్ ని ఖరారు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే మొదట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జూలై 30, 2020లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకుంది. కానీ.. ఆ డేట్ కాస్త జనవరి 8, 2021కి వెళ్లింది. కరోనా కారణంగా షూటింగ్ లు ఆగిపోవడంతో మరోసారి విడుదల తేదీని మార్చారు.
ఇక చిత్ర యూనిట్ కొత్త డేట్ అక్టోబర్ 13, 2021 అని అధికారికంగా ప్రకటన చేసింది. అయితే ఈ డేట్ కి కూడా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ని రిలీజ్ చేయరని ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు చర్చిస్తున్నారు. కాగా.. ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆ డేట్ కి కచ్చితంగా వస్తామన్నట్లుగా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసేదని సినీ ప్రముఖులు అంటున్నారు.
‘అంతేకాదు.. దోస్తీ’ అనే పాటను రిలీజ్ చేయడం.. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని ప్రకటించడంతో దసరాకు సినిమా వస్తుందని అందరు అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు సీన్ మారిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే రాజమౌళి తన సినిమా డేట్ ని 2022కి మార్చడానికి అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ విషయం గురించి ఆయన నోరు విప్పి ఎప్పుడు అఫీషియల్ గా ప్రకటిస్తారో చూడాలి మరి.