టాలీవుడ్ ఇండస్ట్రీ.. ఆ ముగ్గురితోనే లాక్ అయిందా?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఆ ముగ్గురి పైనే ఎక్కువగా ఆధారపడి ఉందా.. ఇక ఆ ముగ్గురు తప్ప  తెలుగు దర్శక నిర్మాతలకు వేరే వాళ్ళు కనిపించడం లేదా.. ఇక అన్ని సినిమాలకు ఆ ముగ్గురె దిక్కయ్యరా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు అని అనుకుంటున్నారా.. ఇంకెవరు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే, రష్మిక మందన,  కీర్తి సురేష్.  ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు ఈ ముగ్గురు హీరోయిన్లు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. దర్శక నిర్మాతలు కూడా ఈ ముగ్గురు హీరోయిన్ల డేట్ల గురించే వేచి చూస్తున్నారు.


 ఒకవేళ ఈ ముగ్గురు హీరోయిన్లు బిజీగా ఉన్నారు అంటే ఇక వారి డేట్స్ ఖాళీ అయ్యేంతవరకు వేచి చూస్తున్నారు తప్ప ఇక మరో హీరోయిన్ ను తీసుకోవాలి అని మాత్రం అనుకోవడం లేదు దర్శకనిర్మాతలు. ఒకప్పుడు అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లను తీసుకువచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు దర్శక నిర్మాతలు.  కానీ ఇప్పుడు మాత్రం ఇక దర్శక నిర్మాతలు ఎక్కువగా ఈ ముగ్గురి పైన డిపెండ్ అవుతున్నట్లు తెలుస్తోంది.  ఇటీవలి కాలంలో కొత్త హీరోయిన్లను ప్రేక్షకులు అంతగా ఆదరించక పోవడం.. ఇక ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుండడంతో సినిమాకి వీళ్ళ క్రేజ్ కూడా కలిసి వస్తూ ఉండటం..  ఇక ఇలాంటి బెనిఫిట్స్ ఉండడంతో రిస్కు చేయకుండా ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని సినిమాల్లోకి తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నారట.



 ప్రస్తుతం యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ ఎవరి సినిమాలు చూసిన ఈ ముగ్గురు హీరోయిన్లే కనిపిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరో గా కొనసాగుతున్న మహేష్ బాబు సర్కారీ వారి పాట సినిమాలో కీర్తి సురేష్ నటిస్తోంది..  ఇక ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్పాలో రష్మిక మందన నటిస్తోంది..  ఇక మరోవైపు ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో.. రామ్ చరణ్ నటిస్తున్న ఆచార్య లో కూడా పూజా హెగ్డే నటిస్తుంది.  ఇలా సినిమాలలో హీరోలు మారుతున్నారు తప్ప హీరోయిన్లు మాత్రం మారడం లేదు. ఈ ముగ్గురే కనిపిస్తున్నారు. ఇలా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఈ ముగ్గురు తోనే లాక్ అయిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: