పవర్ స్టార్ ట్విట్టర్ కి దూరమైనట్టేనా..??
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా రాణిస్తున్నారు. ఇక పవన్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొనాలని అనుకుంటున్నారు. అయితే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొంటున్నాయి. అంతేకాక.. పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ ను మాత్రం అస్సలు వినియోగించడం లేదంట.
ఇక దాదాపు ఐదు నెలల నుంచి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ కు దూరంగా ఉండటంతో పవన్ ట్విట్టర్ కు దూరమైనట్టేనా..? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అంతేకాదు.. పవన్ ప్రజా జీవితంలోకి రావడం వల్లే జనసేన ఖాతాను ఎక్కువగా వినియోగిస్తున్నారని ఆ ఖాతాకు ఫాలోవర్స్ సంఖ్యను పెంచేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో పవన్ పర్సనల్ ఖాతాను వినియోగిస్తారో లేదో చూడాలి మరి.