మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరోసారి రీమేక్ సినిమాలను చేయడం మెగా అభిమానుల్లో నిరాశ ను కలిగిస్తుంది. ఆయన వరుస సినిమాలు ఒప్పుకోవడం ఒకింత ఆనందం కలిగిస్తున్న కూడా ఇప్పుడు అవి రీమేక్ సినిమాలు అవడం తో వారి లో ఎక్కడో మూల నిరాశ కలుగుతుంది. రీమేక్ సినిమాతో హిట్టు కొట్టడం సులువే కానీ అప్పటికే తెలిసిన కథ , కథనం అయి ఉండడంతో ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి ఒక్క పర్సెంట్ అయినా తగ్గుతుందనేది మెగా అభిమానుల వాదన.
ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తరువాత చేస్తున్న మూడు సినిమాలలో రెండు సినిమాలు కూడా రీమేకులు అవ్వడం వారి ని ఎంతో నిరాశపరుస్తుంది. తమి ళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసీఫర్ సినిమాకి రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా కూడా తమిళంలో సూపర్ హిట్ అయినా వేదాళం సినిమాకి రీమేక్. ఒక్క బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేర్ వీరన్న సినిమా మాత్రం ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా.
ఈ నేపథ్యంలో ఎందుకు మన దర్శకులు డైరెక్ట్ తెలుగు సినిమా ను చిరంజీవి తో చేయలేకపోతున్నారు. చిరంజీవికి అలాంటి కథలు ఎందుకు రాయలేకపోతున్నారు అని వారిని అడుగుతున్నారు సినీ విశ్లేషకులు. ఎప్పటినుంచో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ సినిమాలను చేసుకుంటూ వచ్చిన కూడా ఈ రేంజ్ లో ఒకేసారి ఒకే సీజన్లో నాలుగైదు రీమేక్ సినిమాలు చేయలేదు. దాంతో మెగాస్టార్ ని ఒప్పించే దర్శకుడు టాలీవుడ్ లో లేడా అనే సందేహం కలుగుతుంది ప్రేక్షకులకు. ఈ నేపథ్యంలో ఏ దర్శకుడు చిరంజీవితో డైరెక్ట్ తెలుగు సినిమా చేసి ఆయనకు మర్చిపోలేని హిట్ ఇస్తారో చూడాలి.