ప్రాచీన పద్ధతులపై తమన్నా పుస్తకం రాయబోతుందా...?

murali krishna
మిల్కీ బ్యూటీ అయిన తమన్నా ఆల్ రౌండర్ నైపుణ్యం ఇటీవల హాట్ టాపిక్ గా మారిందని సమాచారం. తమన్నా సుమారు ఇరవై సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ తో టాలీవుడ్ లో ఇప్పటికీ తన సత్తా చూపుతుంది.ఇటీవలే బుల్లితెర హోస్ట్ గానూ మారి మాస్టర్ చెఫ్ కార్యక్రమాలతో అలరిస్తుందట. ఇప్పటికే ఓటీటీ సిరీస్ లతోనూ తమన్నా బిజీ బిజీగా ఉన్నారని సమాచారం. బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ అనే భేధం లేకుండా తనకు వచ్చిన అన్ని అవకాశాల్ని తమన్నా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిపోతుందట తమన్నా.

ప్రస్తుతం తన కెరీర్ లో మంచి దశను ఆస్వాధిస్తున్న తమన్నా ఇప్పటికే నితిన్ హీరోగా నటిస్తున్న మాస్ట్రోలో విలన్ పాత్రతో అందరిని భయానికి గురి చేసేందుకు సిద్ధమవుతోందట. అలాగే తరువాత రామ్ చరణ్ - శంకర్ చిత్రంలో విలన్ గా కనిపించనుందని సమాచారం. వెండితెరపై అద్భుతమైన నటిగా ఇటీవల తమన్నా ప్రయోగాలు ఆశ్చర్యపరుస్తున్నాయని సమాచారం. ఇకపై వీటన్నిటికీ  మరింత భిన్నంగా రచయితగా తన కలంతో అందరికి షాక్ ఇవ్వబో్తుందని సమాచారం

`బ్యాక్ టు ది రూట్స్` అనే కొత్త పుస్తకానికి తమన్నా co-writer గా ఉన్నారని సమాచారం. జీవనశైలి కోచ్ ల్యూక్ కౌటిన్హా తో కలిసి తమన్నా ఈ పుస్తకాన్ని రాశారని సమాచారం. ఈ పుస్తకం భారతదేశపు ప్రాచీన జ్ఞానాన్ని పాఠకులకు అందించనుందట.ప్రజలు వారి జీవనశైలిలో పెట్టుబడి పెట్టడం ఎంత తక్కువగా ఉంటుందో ఈ పుస్తకం తెలియజేస్తుందని సమాచారం . వ్యాధులను నివారించడం మరియు దీర్ఘాయువును మెరుగుపరచడం అలాగే జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో ప్రజలకు సహాయపడే పురాతన భారతీయ పద్ధతులను ఈ పుస్తకంలో రాయబోతుందట. బ్యాక్ టు ది రూట్స్ చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది తన మొదటి పుస్తకం అని చెప్పిందట. మన ప్రాచీన పద్ధతుల ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పిందట.ప్రస్తుత కాలంలో సాంస్కృతిక జ్ఞానం అన్నింటికన్నా ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నా మనిషి దేనినీ తప్పించుకోలేకపోతున్నాడని తెలిపిందట. దానికి మందు ఈ పుస్తకంలో ఉందని తమన్నా చెప్పారు.

ల్యూక్ కౌటిన్హో గతంలో ``ది గ్రేట్ ఇండియన్ డైట్ విత్ శిల్పా శెట్టి``మరియు ``ది మ్యాజిక్ వెయిట్-లాస్ పిల్ విత్ అనుష్క శెట్టి`` వంటి పుస్తకాలను రచించారని సమాచారం.పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నట్లు తెలుస్తుంది.ఇది ఆగస్టు 30 వ తేదీ నుండి మార్కెట్లో అందుబాటులో ఉంటుందట . ఈ పుస్తకం ద్వారా ఒత్తిడులు లేని పాత పద్ధతిలో జీవించడం ఎలానో అందరికి అలవడుతుందని తమన్నా చాలా కాన్ఫిడెంట్ గా చెబుతోందని తెలుస్తుంది.ప్రతి చిన్నదానికీ ఆస్పత్రులకు పరుగులు పెట్టే నేటితరానికి ఇలాంటి విజ్ఞానదాయకమైన పుస్తకం అవసరం ఎంతో ఉందని చెప్పిందట

తమన్నా నటించిన పలు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. `సిటీమార్`మరియు `గుర్తుందా శీతాకాలం` విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3తోనూ తమన్నా చాలా బిజీగా ఉందని సమాచారం.  అలాగే తమన్నా నటించిన `దటీజ్ మహాలక్ష్మీ` సినిమా అన్ని పనులు పూర్తైనా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ కూడా లేదట. త్వరలోనే ఈ పెండింగ్ ప్రాజెక్టుల విడుదలపైనా క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: