ట్రెండ్ సెట్టింగ్ పై కన్నువేసిన హరనాథ్ మనవడు !
ఎన్టీఆర్ రావణాసురుడు గా నటించిన ‘సీతారామ కళ్యాణం’ మూవీలో రాముడుగా నటించిన హరనాథ్ ను చూసి అతడు రామారావు కు పౌరాణిక పాత్రలలో పోటీ ఇవ్వగల నటుడు హరనాథ్ అంటూ అప్పటి మీడియా ప్రశంసలు కురిపించింది. అయితే అలాంటి పేరు తెచ్చుకున్న హరనాథ్ ఆతరువాత కాలంలో చేసిన కొన్ని పొరపాట్లు వల్ల తన ప్రాభవాన్ని అంతా కోల్పోయాడు.
ఇప్పుడు అతడి మనవడు ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని మీడియా వర్గాలు బాగా హైలెట్ చేస్తున్నాయి. హరనాథ్ సోదరుడు వెంకట్ సుబ్బరాజు మనవడు విరాట్ రాజ్ ఒక మూవీతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. వెంకట సుబ్బరాజు కూడా అప్పట్లో కొన్ని సినిమాల్లో నటించారు. ప్రస్తుతం విరాట్ రాజ్ పరిచయం అవుతున్న చిత్రం పేరు 'సీతామనోహర శ్రీరాఘవ'. ఈమూవీ ద్వారా దుర్గా శ్రీ వత్సస.కె. దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
‘కె.జి.ఎఫ్. 2’ ‘సలార్’ చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న రవి బసూర్ ఈ చిత్రానికి సంగీతం ఇవ్వడం మరొక ట్విస్ట్. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతోంది. హరనాథ్ వారసుడుగా పరిచయం అవుతున్న ఈ యంగ్ హీరోకు ఇండస్ట్రీ నుండి ఎలాంటి ప్రోత్సాహం ఉంటుందో చూడాలి. గతంలో మహానటుడు ఎస్.వి. రంగారావు మనవడు ఇలాగే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అతడికి సరైన ప్రోత్సాహం లభించలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణించాలి అంటే ఇండస్ట్రీ పెద్దలతో పరిచయాలతో పాటు వారందర్నీ కలుపుకుని పోగల సామర్థ్యం ఉండాలి. దీనితో పరిచయంకాబోతున్న ఈ యంగ్ హీరో ఈ ఒక్క సినిమాతోనే తెరమరుగు అవుతాడా లేకుంటే కొంతాకాలం నిలపడతాడ అన్న విషయం రానున్న కాలంలో తేలుతుంది..