టాలీవుడ్: ఈ డైరెక్టర్ల తీరు తెలిస్తే షాక్ అవుతారు!

Suma Kallamadi
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు అడుగు పెట్టారు కానీ వారిలో కొందరు మాత్రమే విజయవంతమయ్యారు. మిగిలిన దర్శకులు తమ కెరీర్ మొత్తంలో ఎక్కువగా ఫ్లాప్ లనే ఇచ్చారు. తమాషా ఏంటంటే వారందరూ కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేశారే తప్ప చిన్న హీరోల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కంత్రీ , బిల్లా, శక్తి షాడో వంటి చిత్రాలను మెహర్ రమేష్ డైరెక్ట్ చేశారు కానీ అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయితేనేం.. ఇప్పుడు ఏకంగా చిరంజీవితో కలిసి భోళాశంకర్ సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

అతనిని నమ్ముకున్న నిర్మాతలందరూ నిండా అప్పుల్లో మునిగారని అప్పట్లో సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయన ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా కొట్టలేదు కానీ భారీ బడ్జెట్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నారు. నిజానికి మొదటినుంచీ మెహర్ రమేష్ ను మెగా ఫ్యామిలీ దూరం పెడుతూ వస్తోంది. టాలెంట్ లేని వ్యక్తితో సినిమాలు తీయడం చాలా రిస్క్ తో కూడుకున్న అన్న ధోరణిలో మెగా ఫ్యామిలీ ఉండేది. కానీ భోళాశంకర్ విషయంలో మాత్రం అతనిపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు.

గోపీచంద్ మలినేని కూడా కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు తీయకుండానే రొటీన్ సినిమాలతో ప్రేక్షకులను విసిగిస్తున్నారు. ఇక భద్ర సినిమాతో మంచి హిట్ కొట్టిన బోయపాటి శ్రీను.. ఆ కథను కొరటాల శివ నుంచి తీసుకున్నట్లు చెప్పి షాక్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. లక్ ఫ్యాక్టర్ వల్ల ఒకటీ రెండు సినిమాలు హిట్ అయ్యాయి కానీ ఆయన మాత్రం హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ బాండ్ లా ఫీల్ అవుతూ ప్రవర్తిస్తుంటారు. యాక్షన్ అంటూ ఆయన చూపించే ఆటిట్యూడ్ ప్రతి ఒక్కరికీ చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఇక అగ్ర దర్శకులుగా రాణిస్తున్న కొందరు దర్శకులు సైతం కాపీలు కొట్టడం.. అటువంటి లాజిక్ లేని సినిమా తీసి ప్రజల డబ్బును నొక్కేయడం వంటివి చేస్తున్నారు. అందరు డైరెక్టర్ మాత్రం తమ సొంత టాలెంట్ తో మంచి హిట్స్ అందిస్తూ తెలుగు సినిమాల స్థాయిని పెంచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: